Adulterated Diesel: సాధారణంగా రాష్ట్ర సీఎం రోడ్డుపై ప్రయాణిస్తున్నారంటే అధికారుల హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీఎం ఉండే వాహనానికి ముందు వెనక పదుల సంఖ్యలో వెహికాల్స్ రయ్ రయ్ అంటూ దూసుకెళ్తుంటాయి. రైలు బోగీలను తలపిస్తూ ఒకదాని వెంట పరిగెడుతుంటాయి. కాన్వాయ్ లో ఏ ఒక్క వాహనం ట్రబుల్ ఇచ్చినా పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. అలాంటిది ఏకంగా సీఎం కాన్వాయ్ మెుత్తం నడిరోడ్డుపై ఆగిపోతే పరిస్థితి ఏంటి. ఊహిస్తేనే విచిత్రంగా ఉంది కదూ. కానీ ఇది నిజంగా జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చకు తావిస్తోంది.
అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్ లో రాష్ట్రంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సీఎం మోహన్ యాదవ్ (Mohan Yadav) ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని వాహనాలు అన్ని ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం మోహన్ యాదవ్.. రోజువారి కార్యక్రమాల్లో భాగంగా రత్లాంగ్ రోడ్డులో ప్రయాణించారు. ఈ క్రమంలో వాహనాలకు ఇంధనం అవసరమై.. ఓ పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కొట్టించారు.
VIDEO | Ratlam, Madhya Pradesh: As many as 19 vehicles of CM Mohan Yadav's convoy had to be towed after water was reportedly filled instead of diesel in them. The petrol pump was later sealed over fuel contamination.#MPNews #MadhyaPradeshNews
(Full video available on PTI… pic.twitter.com/IQV9aE2Jfc
— Press Trust of India (@PTI_News) June 27, 2025
కల్తీ డీజిల్ వల్లే..
అయితే పెట్రోల్ బంక్ దాటి కాన్వాయ్ కొద్దిదూరం ప్రయాణించగానే ఒక్కసారిగా వాహనాల్లో సమస్యలు తలెత్తాయి. ఇంజిన్ ఒక్కసారిగా మెురాయించడంతో నడిరోడ్డుపై వాహనాలన్నీ ఆగిపోయాయి. సమస్య ఏంటో తెలుసుకునేందుకు అధికారులు డీజిల్ ట్యాంక్ లను ఓపెన్ చేసి చూడగా అందులో నీళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏకంగా సీఎం కాన్వాయ్ కే కల్తీ డీజిల్ కొట్టడం చూసి ఆశ్చర్యపోయారు. పెట్రోల్ పంప్ వద్దకు వెళ్లి అధికారులు తనిఖీ చేయగా కల్తీ జరిగిందని నిర్ధరణకు వచ్చారు. దీంతో పెట్రోల్ బంక్ ను వెంటనే సీజ్ చేశారు.
Also Read: Minister Seethakka: మావోయిస్టుల లేఖపై సీతక్క సంచలన రియాక్షన్.. ఒక్కొక్కరికి ఇచ్చిపడేశారుగా!
నెటిజన్ల రియాక్షన్
సీఎం కాన్వాయ్ కే నాశిరకం డీజిల్ కొట్టిన ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందింస్తున్నారు. కల్తీ పెట్రోల్, డీజిల్ తో సామాన్యుల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఇప్పటికైనా తెలిసిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాశిరకం ఇందనం వాడటం వల్ల తమ వాహనాలకు మైలేజ్ రాకపోగా.. నిత్యం ఏదోక రిపేర్లు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కాబట్టి పెట్రోల్ బంకులపై తనిఖీ చేపట్టి.. నాణ్యం లేని వాటిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.