aghori ( Image Source: Twitter)
Viral

Lady Aghori: గెటప్ మార్చిన అఘోరీ.. మైక్ ముందు అందరూ పతివ్రతలే.. నెటిజన్ల కామెంట్స్ వైరల్

Lady Aghori: లేడీ అఘోరీ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని నెలల క్రితం ఎంత ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. లేడీ అఘోరీ శ్రీనివాస్ అని పిలవబడే అలియాస్ అల్లూరి శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాడు. సనాతన ధర్మం పరిరక్షణ పేరుతో దేవాలయాల వద్ద రచ్చ చేసి, వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే అతనిపై మోసం, బెదిరింపు, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలతో పలు రకాల కేసులు నమోదయ్యాయి.

Also Read: Nodha Hospital: నోద హాస్పిటల్‌లో మళ్లీ ఆపరేషన్ వికటించిందా?..పేషెంట్ల ప్రాణాలు సైతం లెక్కలో లేనట్టేనా?

తప్పించుకుని తిరుగుతుంటే.. మోకిలా పోలీసులు శ్రీనివాస్‌ను ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేసి, ఒక మహిళను రూ. 9.8 లక్షలు మోసం చేసిన ఆరోపణలతో అతన్ని జైలుకు పంపారు. తాంత్రిక పూజల పేరుతో డబ్బు వసూలు చేసి, వారిని బెదిరించినట్లు ఫిర్యాదు నమోదు చేశారు. ఇది మాత్రమే కాకుండా కరీంనగర్‌లో ఒక మహిళ శ్రీనివాస్ పై అత్యాచార యత్నం, లైంగిక వేధింపుల ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఆమెను బెదిరించి రూ. 3 లక్షలు వసూలు చేశాడని తెలిపింది.

Also Read: Pradeep Ranganathan: ప్రత్యేకించి దాని కోసమే హైదరాబాద్ వచ్చిన ప్రదీప్ రంగనాధన్.. ఏం అన్నాడంటే?

శ్రీనివాస్ మంగళగిరికి చెందిన శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్నాడని, ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. శ్రీవర్షిణి మాత్రం ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నట్లు మీడియా సాక్షిగా తెలిపింది. ఇదిలా ఉండగా.. ఎన్నడూ లేనిది.. లేడీ అఘోరీ గెటప్ మొత్తం మార్చాడు.

Also Read: Komatireddy Venkat Reddy: యువతకు స్కిల్స్ పెంచి, ఉపాధి కల్పించడమే సర్కార్ లక్ష్యం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

లేడీ అఘోరీ మాట్లాడుతూ ” దుస్తులు ధరించడం అనేది ప్రజలందరూ కోరుకున్నారు. కొంతమంది టార్గెట్ చేసిన వారు కూడా చెప్పారు కాబట్టి, దుస్తులు పెద్ద మేటర్ కాదు. కానీ, ఇక్కడ నేను ఏం అనుకున్నాను అంటే.. సొసైటీ లో మన దేశం మొత్తం తిరుగుతున్నాం. వాటితో పాటు ఇంకో రెండు దేశాలు కూడా తిరుగుతున్నాం కాబట్టి, సమాజం మారుతుంది, అలాగే ట్రెండ్ కూడా మారుతుంది. ప్రకృతిలో కూడా కొత్తమార్పులు వస్తున్నాయి. అలాంటప్పుడు నేను మారడంలో తప్పు లేదని భావించి.. నేను దుస్తులు ధరించడం జరిగింది. నేను ఏ బాటలో అయితే.. నడిచానో.. ఆ బాటలోనే నడుస్తున్నా, నా పూజలు నేను రోజూ చేసుకుంటున్నా ” అని మీడియాకి వివరించాడు.

 

Just In

01

The Strangers Chapter 2 review: ఎవరో? ఎందుకో? తెలియకుండా చంపేస్తుంటారు.. చూస్తే వణకాల్సిందే..

Bigg Boss Telugu Promo: వైల్డ్ కార్డు దివ్యతో బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్.. టాప్‌లోకి దూసుకొచ్చిన భరణి!

Hyderabad: ప్రారంభానికి సిద్ధమైన ఆరు ఎస్టీపీలు.. మరో 39 కొత్త ఎస్టీపీలకు శంకుస్థాపన

TGSRTC Lucky Draw : బస్సు ఎక్కండి.. గిఫ్ట్ పట్టండి.. టీజీఎస్ఆర్టీసీ దసరా లక్కీ డ్రా..!

Telangana Govt: అందరిచూపు ఆ జీవో వైపు.. బీసీ రిజర్వేషన్లపై నేడు రానున్న క్లారిటీ!