Kethi Reddy as Pilot: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తాజాగా పైలట్ అవతారంలో కనిపించి మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కేతిరెడ్డి, ఈసారి ఓ ఛాపర్ (హెలికాప్టర్)ను స్వయంగా నడిపి అందరి దృష్టిని ఆకర్షించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విమానాన్ని చక్కర్లు కొట్టించిన ఆయన, ఈ సాహసానికి సంబంధించిన వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు.
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన కలను నిజం చేసుకున్నట్లు పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్‌ను పంచుకున్నారు. “కల నిజమైంది. అధికారికంగా పైలట్ అయ్యాను. ఇది ప్రారంభం మాత్రమే. ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇలాంటి సాహసాలు మరెన్నో ఉన్నాయి” అని ఆయన ట్వీట్‌లో తెలిపారు. ఈ పోస్ట్‌తో పాటు ఆయన షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: పది అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు
రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన కేతిరెడ్డి, ఇప్పుడు పైలట్‌గా కొత్త రంగంలో సాహసయాత్రను ప్రారంభించడం ఆయన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. హైదరాబాద్ ఆకాశంలో ఛాపర్‌ను నడుపుతూ ఆయన చేసిన ఈ ప్రదర్శనతో ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రజలు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మాజీ ఎమ్మెల్యేగా రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఇప్పుడు పైలట్‌గా కొత్త ఎత్తులకు ఎగరడం ద్వారా తన టాలెంట్‌ను మరోసారి నిరూపించారు. రాబోయే రోజుల్లో ఆయన ఇంకేం చేయబోతున్నారోనని అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.
పైలట్ ట్రైనింగ్ తీసుకున్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే
చాపర్ విమానాన్ని నడుపుతూ హైదరాబాద్ పరిసరాల్లో చక్కర్లు
'కల నిజమైంది. అధికారికంగా పైలట్ అయ్యా. ఇది ప్రారంభం మాత్రమే. ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇలాంటి సాహసాలు మరెన్నో ఉన్నాయి' అని Xలో… pic.twitter.com/GzFE1EysUj
— BIG TV Breaking News (@bigtvtelugu) March 31, 2025