Indian Navy jobs: నిరుద్యోగులకు ఇండియన్ నేవీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రిక్రూట్‌మెంట్ లో భాగంగా సిరాంగ్ ఆఫ్ లాస్కార్స్, లాస్కార్ , ఫైర్‌మ్యాన్ (బోట్ క్రూ) , టాప్ పాస్ పోస్టులకు ధరఖాస్తులు కోరుతోంది. మొత్తం గ్రూప్ సిలో 327 పోస్టుల్లో భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 12-03-2025న ప్రారంభమై 01-04-2025 న ముగుస్తుంది. అర్హత గల అభ్యర్థులు ఇండియన్ నేవీ వెబ్‌సైట్ లింక్ joinindiannavy.gov.in పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఇండియన్ నేవీ 327 గ్రూప్ సి ఉద్యోగ ఖాళీలను ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఇండియన్ నేవీ అధికారికంగా గ్రూప్ సి కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. నియామక ప్రక్రియ, అర్హత, దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ joinindiannavy.gov.in లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం:
దరఖాస్తు రుసుము:
లేదు.
ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి:
కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 25 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
Also Read: Ugadi 2025: ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్.. వీరికి గుడ్ టైమ్.. మీ రాశి ఎందులో ఉంది?
అర్హత:
అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం:
సిరాంగ్ ఆఫ్ లాస్కార్స్ కోసం: పే మ్యాట్రిక్స్ లెవల్-4 రూ. 25, 500 నుంచి 81, 100 వరకు వేతనం చెల్లిస్తారు.
లాస్కార్-ఐ, ఫైర్‌మ్యాన్ (బోట్ క్రూ), టాప్‌పాస్ కోసం: పే మ్యాట్రిక్స్ లెవల్-1 రూ.18,000 నుంచి 56,900 వరకు వేతనం చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
షార్ట్‌లిస్టింగ్ అప్లికేషన్
రాత పరీక్ష
స్కిల్ టెస్ట్
డాక్యుమెంట్ల వెరిఫికేషన్
వైద్య పరీక్ష
ఇండియన్ నేవీ గ్రూప్ సి రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు
సిరాంగ్ ఆఫ్ లాస్కార్స్ – 57
లాస్కార్ – 192
ఫైర్‌మ్యాన్ (బోట్ క్రూ) – 73
టాప్ పాస్ – 05
ముఖ్యమైన తేదీలు
ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 12-03-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ: 01-04-2025