Woman Kills Husband (Image Source: AI)
Viral

Woman Kills Husband: ఇదెక్కడి విడ్డూరం.. భర్తను దారుణంగా చంపి.. నేరం పులి మీదకు తోసిన భార్య

Woman Kills Husband: కర్ణాటకలో విచిత్రకర ఘటన చోటుచేసుకుంది. మైసూర్ జిల్లాలో ఓ భార్య తన భర్తను దారుణంగా హత్య చేసి.. ఆ నేరాన్ని పులి మీదకు నెట్టే ప్రయత్నం చేసింది. పులి దాడిలో తన భర్త చనిపోయాడని చెప్పి.. ప్రభుత్వం నుంచి పరిహారం కూడా పొందాలని కుట్ర పన్నింది. చివరికి అసలు నిజం తెలియడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు.

అసలేం జరిగిందంటే?
మైసూరు జిల్లా హున్సూరు తాలూకా (Hunsuru taluk)లోని చిక్కహెజ్జూరు గ్రామం (Chikkahejjur village)లో ఈ విచిత్రకర ఘటన చోటుచేసుకుంది. 45 ఏళ్ల వెంకటస్వామి (Venkataswamy), భార్య సల్లపురి (Sallapuri) తోటల్లో కూలీలుగా పని చేసేవారు. సోమవారం హెజ్జూరు గ్రామం (Hejjur village)లో పులి కనిపించిందని గ్రామంలో ప్రచారం జరిగింది. వెంటనే సల్లపురి తన భర్త కనిపించడం లేదని పులి దాడి చేసి మృతదేహాన్ని లాక్కుపోయి ఉంటుందని పోలీసులకు చెప్పింది.

Also Read: Lawyers Fight: హైకోర్టులో షాకింగ్ ఘటన.. జడ్జి ముందే గొడవ పడ్డ లాయర్లు.. వీడియో వైరల్

ఇంటి వెనక భర్త శవం
సల్లపురి ఫిర్యాదుతో పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి మృతదేహం కోసం అడవిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. కానీ ఎలాంటి ఆధారం కనిపించకపోవడంతో.. భార్యపై అనుమానాలు మెుదలయ్యాయి. దీంతో ఆమె ఇంటిని పరిశీలించగా.. ఇంటి వెనక ప్రాంతంలో వెంకటస్వామి మృతదేహాం బయటపడింది.

Also Read: Women vs Jackel: ఈ బామ్మ భల్లాలదేవ కంటే పవర్ ఫుల్.. చీర కొంగుతో నక్కను రఫ్పాడించింది!

భర్తను ఎందుకు చంపిందంటే?
భార్యను తమదైన శైలిలో పోలీసులు విచారించగా.. తానే వెంకటస్వామిని హత్య చేసినట్లు సల్లపూరి ఒప్పుకుంది. భర్తకు భోజనంలో విషమిచ్చి చంపినట్లు స్పష్టం చేసింది. అనంతరం, మృతదేహాన్ని ఇంటి వెనక భాగంలో దాచినట్లు చెప్పింది. అయితే తాను అరేకా తోటల్లో పనిచేస్తూ ఉండగా ప్రభుత్వం వాళ్లు పులి దాడిలో మరణించిన వారికి రూ.15 లక్షల పరిహారం ఇస్తారనే విషయం విన్నానని సల్లపూరి పోలీసులకు తెలిపింది. అందుకే భర్తను హత్య చేయాలని నిర్ణయించుకున్నానని వివరించింది. అయితే ఆమె చెప్పింది విని పోలీసులు సైతం అవాక్కైనట్లు తెలుస్తోంది.

Also Read: Japan Centenarians: పాపం జపాన్.. ప్రపంచ రికార్డు బద్దలుకొట్టినా.. సంతోషం లేకపాయే!

Just In

01

Kishkindhapuri: ‘ఓజీ’ వచ్చే వరకు.. ‘కిష్కింధపురి’ రెస్పాన్స్‌పై టీమ్ రియాక్షన్ ఇదే!

HCA Scam: జగన్మోహన్​ రావు టైంలో హెచ్​సీఏ ఎన్నో అక్రమాలు.. తెలిస్తే షాక్?

Sushila Karki: నేపాల్‌కు తాత్కాలిక ప్రధాని ఎంపిక పూర్తి!.. ప్రమాణస్వీకారానికి సర్వంసిద్ధం

Revanth Reddy: గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి… అధికారులకు సీఎం ఆదేశం

Dasoju Sravan: గ్రూప్1 పరీక్షను తిరిగి నిర్వహించాలి.. ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు