Kangana Ranaut: హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లగా, అక్కడ భార్య సోనమ్ రఘువంశీ హత్య కుట్రలో బలైన రాజా రఘువంశీ విషాదాంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జాతీయ మీడియాలో గత రెండు రోజులుగా ఈ ఉదంతమే ప్రధానవార్తగా ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో, ఈ కేసుకు సంబంధించిన ప్రతి చిన్న అంశం వైరల్‌గా మారుతోంది. నెటిజన్లు కూడా ఈ వ్యవహారంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) మంగళవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Read this- Muda case: సీఎం సిద్ధరామయ్యకు షాక్.. ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులు అటాచ్
నాలి వాళ్లను నమ్మొద్దు
సోనమ్ రఘువంశీపై కంగనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరపూరిత ప్రవర్తనపై భగ్గుమన్నది. సోనమ్ రఘువంశీ చేసిన దుర్మార్గాన్ని నమ్మలేకపోయానని, ఆమె ఒక నాలిది (Dumb) అని అభివర్ణించింది. ‘‘ఎంత అసంబద్ధమైన పని ఇది!!. ఒక అమ్మాయి ఆమె తల్లిదండ్రులకు భయపడి పెళ్లికి నో చెప్పలేదు. కానీ, సుపారీ హంతకులతో ఇంత భయంకరమైన హత్యకు ప్లాన్ చేయగలదు. ఉదయం నుంచి నా మనసులో ఈ అంశమే ఉంది. దాని నుంచి నా ఆలోచన పక్కకు పోవడం లేదు. ఇప్పుడైతే తలనొప్పి కూడా వస్తోంది!!. ఆమె కనీసం విడాకులు తీసుకోలేకపోయింది. ప్రియుడితో కూడా పారిపోలేకపోయింది. హత్య చేయడం నిజంగా ఎంత క్రూరమైనది, ఎంతటి హేయమైనది. చాలా అసంబద్ధమైన పని ఇది. ఆమె ఒక నాలిది. నాలి వాళ్లను ఎప్పుడూ నమ్మకూడదు. అలాంటి వాళ్లు సమాజానికి పెద్ద ముప్పు తలపెట్టగలరు. నాలివారిని చూసి మనం నవ్వుతాం. ఎవరికీ హానిచేయబోరని అనుకుంటాం. కానీ, అది నిజం కాదు. వారి మంచి కోసం ఇతరులకు హాని కలిగజేస్తారు. మీ చుట్టపక్కల సైలెంట్‌గా ఉండేవారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ విషయాన్ని మరచిపోకండి’’ అని ఇన్‌స్ట్రాగ్రామ్ వేదిక కంగనా రనౌత్ రాసుకొచ్చింది.
Read this- Lover Twist: ప్రియురాలి కోసం ఇంట్లో చేయకూడని పని.. తల్లిదండ్రుల లబోదిబో
అలసిపోయినట్టు నటించిన సోనమ్
భర్త హత్యకు కుట్ర పన్నిన సోనమ్ ఒకానొక సమయంలో అలసిపోయినట్లు నటించింది. తన భర్త, హంతకుల కంటే వెనుక చాలా దూరంలో నడవడం మొదలుపెట్టింది. వెనకే నడుస్తూ ఎవరూ లేని ప్రదేశానికి వచ్చామని నిర్ధారించుకున్న తర్వాత, తన భర్తను చంపేయాలంటూ హంతకులను ఆమె కోరినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, సోనమ్ చెప్పిన వెంటనే హత్య చేసేందుకు హంతకులు ఒప్పుకోలేదు. అలసిపోయామని చెప్పి హత్యకు నిరాకరించారు. దీంతో, ఎక్కడ ఛాన్స్ మిస్ అవుతుందేమోనని ఆందోళన చెందిన సోనమ్ సుపారీని ఏకంగా రూ.20 లక్షలకు పెంచింది. రాజా మృతదేహాన్ని భారీ లోయలో పడవేయడంలో హంతకులకు సోనమ్ కూడా సాయం చేసిందని తేలింది. రాజా రఘువంశీ తలపై రెండుసార్లు బలంగా కొట్టినట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. తల ముందు భాగంలో ఒకసారి, వెనుక భాగంలో ఒకసారి చాలా బలంగా కొట్టారు. జూన్ 3న రాజా మృతదేహం లభ్యమైన రోజే భార్య సోనమ్ పాత్ర ఉన్నట్టు మేఘాలయ పోలీసులకు అర్థమైపోయింది.