Viral Video: కాళీమాత విగ్రహానికి.. మేరిమాత అలంకరణ
Viral Video (Image Source: Twitter)
Viral News

Viral Video: షాకింగ్ ఘటన.. కాళీమాత విగ్రహానికి.. మేరిమాత అలంకరణ

Viral Video: మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాళీమాత విగ్రహాన్ని (Kali Mata idol) మేరిమాత (Mother Mary) రూపంలోకి మార్చడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆలయ పూజారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, విగ్రహానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?

ముంబయిలోని ఆర్‌సీఎఫ్ పోలీసు స్టేషన్ (R.C.F. Police Station) పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సబర్బన్ చెంబూర్ (Suburban Chembur) ప్రాంతంలోని కాళీమాత ఆలయంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం దేవాలయాన్ని సందర్శించిన భక్తులు.. మేరిమాత వేషధారణలో ఉన్న కాళీమాత విగ్రహాన్ని చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.

పూజారీ ఏం చెప్పారంటే?

విగ్రహం అలంకరణలో జరిగిన తీవ్ర తప్పిదం గురించి స్థానిక పోలీసులకు భక్తులు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో ఆలయ పూజారి అయిన రమేష్ ను అమ్మవారి అలంకరణ గురించి నిలదీశారు. ఈ క్రమంలో రమేష్ చెప్పిన సమాధానం చూసి అక్కడి వారంతా షాక్ కు గురయ్యారు. కాళీమాత తనకు స్వప్నంలో కనిపించి.. మేరిమాతగా తనను అలంకరించమని ఆదేశించినట్లు పూజారి చెప్పుకొచ్చారు.

కస్టడీ విధించిన కోర్టు

ఇదిలా ఉంటే హిందువుల మతపరమైన భావాలను దెబ్బతీసిన కారణంగా పూజారీ రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టులో అతడ్ని హాజరు పరచగా.. న్యాయస్థానం అతడికి రెండ్రోజుల కస్టడీ విధించింది. అయితే పూజారి రమేష్ వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ చేత కావాలనే ఇలా చేయించారా? అన్న దానిపై విచారణ చేస్తున్నారు.

Also Read: Singareni Solar Power: సింగరేణిలో సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్.. బీఈఎస్ఎస్ ఎందుకు? ఉపయోగం ఏమిటి?

రాంచీలోనూ ఇంతే..!

ఇదిలా ఉంటే గత నెల ఝార్ఖండ్ లోని రాంచీలో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన ‘వాటికన్ సిటీ థీమ్’తో దుర్గాపూజ పండల్ ను నిర్మించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై విశ్వహిందూ పరిషత్ (VHP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది హిందువుల మతపరమైన భావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. మతమార్పిడిని ప్రోత్సహించడమే లక్ష్యంగా పండల్ నిర్వాహకులు ఈ చర్యకు పూనుకున్నారని మండిపడింది.

Also Read: Shalibanda Fire Accident: శాలిబండలో అసలేం జరిగింది? గోమతి ఘటనపై ఎన్నో అనుమానాలు!

Just In

01

Medaram Jatara: మేడారం జాతర పనుల పురోగతిపై మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీ..!

Chevella Municipality: మున్సిపల్ చైర్మన్ పీఠంపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ పోటీ.. అందరి చూపు అటువైపే..!

Peddi: ‘పెద్ది’ ఈ ఫొటో ఎక్కడిది? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్!

PuriSethupathi: పూరిసేతుపతి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌కి.. ఎట్టకేలకు మోక్షం!

Anil Ravipudi: శంకర్ వరప్రసాద్ గారి కోసం నయన్‌కు ‘దృశ్యం’ కథ చెప్పిన అనిల్ రావిపూడి!