Viral Video (Image Source: Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Viral Video: ఓరి బాబోయ్.. ఫోన్ పోతే ఇంతగా గుండెలు బాదుకోవాలా.. వీడియో వైరల్!

Viral Video: ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరికి మెుబైల్ ఫోన్ తప్పనిసరిగా మారిపోయింది. చేతిలో స్మార్ ఫోన్ లేకుండా కనీసం గంట కూడా గడపలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం ఒక మనిషి సగటున రోజులో 3-5 గంటలు మెుబైల్ కే కేటాయిస్తున్నట్లు తెలింది. దీని ప్రకారం మెుబైల్ కు మనుషుసు ఏ విధంగా అడిక్ట్ అయిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలాఉంటే తాజాగా మెుబైల్ పొగోట్టుకున్న వ్యక్తి ప్రవర్తించిన తీరు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోన్ పోయిందని అతడు విలవిలలాడిపోవడం చర్చకు తావిస్తోంది.

అసలేం జరిగిందంటే?
రాజస్థాన్ జైపూర్ లోని సుభాష్ చౌక్ (Subhash Chowk) ప్రాంతంలో భారీగా వర్షం కురవడంతో రోడ్డుపైకి వరద నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో రోడ్డుపై హల్దార్ (Haldhar) అనే వ్యక్తి.. యాక్టివా స్కూటర్ (Activa scooter) పై అటుగా వచ్చాడు. రామ్నివాస్ బాగ్ (Ramniwas Bagh) ప్రాంతం వద్దకు రాగానే బండిపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో నీటిలో పడిపోతుండగా తిరిగి బ్యాలెన్స్ తెచ్చుకొని తిరిగి బండిని కంట్రోల్ చేయగలిగాడు. అయితే ఈ ప్రక్రియలో అతడి జేబులోని మెుబైల్.. రోడ్డుపైన ఉన్న నీటిలో పడిపోయింది. బండి పక్కన పార్క్ చేసి నీటిలో ఎంతగా గాలించినప్పటికీ అది దొరకలేదు.

మెుబైల్ కోసం కన్నీరుమున్నీరు
సెల్ ఫోన్(Cell Phone) కపించకపోవడంతో హల్దార్ తీవ్ర కుంగుబాటుకు లోనయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీటితో రోడ్డుపక్కన అమాంతం కూర్చుండిపోయాడు. తలపై చేతులు పెట్టుకొని బోరున విలపించాడు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరుమున్నీరు అయ్యాడు. అసలేం జరుగుతుందో తెలియక అటుగా వెళ్తున్న వాహనదారులు.. హల్దార్ వైపు చూస్తూ ఉండిపోయారు.

Also Read: Cow Calf: రెండు కాళ్లతో నడుస్తున్న ఆవు దూడ.. కోవిడ్‌ను మించిన ముప్పు రాబోతుందా.. దేనికి సంకేతం?

నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే
హల్దార్ కన్నీరు పెట్టుకుంటున్న వీడియో బయటకు రావడంతో అది క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు హల్దార్ కు బాసటగా నిలిస్తే మరికొందరు విమర్శిస్తున్నారు. ఒక మెుబైల్ (Mobile) పోయిందని ఇంతగా కుంగిపోవాలా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రవాహం ఉన్న నీటిలో ప్రయాణించడమే తప్పని.. ఒకవేళ మ్యాన్ హోల్ (Man Hole) ఉండి ఉంటే నీ పరిస్థితి ఏంటీ? మరొకరు ప్రశ్నించారు. అయితే కొత్త మెుబైల్ కొనుక్కునే స్థోమత అతడికి లేకపోయి ఉండొచ్చని మరికొందరు సానుభూతి చూపిస్తున్నారు.

Also Read This: Kerala Class Rooms: పాపం బ్యాక్ బెంచర్స్.. ఇలా బుక్కయ్యారేంటీ.. ఇక కష్టమే!

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?