19 Minutes Viral Video: టీనేజర్స్ ప్రైవేటు వీడియోపై సోషల్ మీడియాల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ యువతి, యువకుడు ఏకాంతంగా గడిపిన 19 నిమిషాల వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. జెన్ జెడ్ యువత విపరీత పోకడలకు ఈ వీడియో అద్దం పడుతోందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న వీడియో సైతం తెరపైకి వచ్చింది. ప్రైవేటు వీడియో లీక్ కావడంతో సదరు యువతి ఆత్మహత్య చేసుకుందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవమెంత? నిజంగానే ఆ యువతి సూసైడ్ చేసుకుందా? ఇప్పుడు పరిశీలిద్దాం.
ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిందంటే?
టీనేజర్ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్న వీడియోను గమనిస్తే అందులో నేలపై ఓ మృతదేహాం ఉంది. డెడ్ బాడీ చుట్టూ జనం, పోలీసులు ఉన్నారు. ఫ్యాక్ట్ చెక్ రిపోర్టు ప్రకారం.. మరణ వీడియోలో కనిపించే యువతి.. 19 నిమిషాల ఎంఎంఎస్ వీడియోని టీనేజర్ ఒకటి కాదు. ఇవి పూర్తిగా వేర్వేరు ఘటనలని తేలింది. పలువురు యూజర్లు ఉద్దేశపూర్వంగా ఈ రెండు ఘటనలను కలిపి.. తప్పుడు వార్తలను నెట్టింట ప్రచారం చేస్తున్నారని ఫ్యాక్ట్ టీమ్ ధ్రువీకరించింది. దీన్ని బట్టి టీనేజర్ యువతి చనిపోయిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టమవుతోంది.
View this post on Instagram
టీనేజర్ల కోసం సెర్చింగ్..
మరోవైపు లీకైన వీడియోలోని టీనేజ్ జంట గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిని గమనించిన కొందరు వ్యక్తులు.. నెట్టింట తప్పుడు సమాచారాలను వ్యాప్తి చేస్తున్నారు. ఎక్కడో చనిపోయిన మహిళ వీడియోను తీసుకొచ్చి.. టీనేజర్ యువతికి ముడిపెడుతున్నారు. దానిని ఇన్ స్టాగ్రామ్ రీల్స్ రూపంలో విపరీతంగా ట్రెండింగ్ చేస్తున్నారు. మరోవైపు ఎంఎస్ఎస్ వీడియోకు కొనసాగింపుగా ఇంకో రెండు ప్రైవేటు వీడియోలు సైతం వచ్చాయంటూ రెండ్రోజుల క్రితం కొత్త పుకార్లు సృష్టించారు.
Also Read: Telangana Govt: ఆదర్శవంతమైన నిర్ణయాలు.. ఆర్థిక భరోసా పథకాలు.. పారిశ్రామికవేత్తలతో పోటీ పడుతున్న మహిళలు
బాధ్యత ఉండక్కర్లేదా?
టీనేజర్లు తెలిసో, తెలియకో చేసిన తప్పును కొందరు సోషల్ మీడియా వేదికగా భూతద్దంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యువతి, యువకుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా టీనేజర్లు చాలా సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తమకు ప్రతీకూలంగా ఏ చిన్న విషయం జరిగినా అస్సలు తట్టుకోలేరు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఏటా పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి సదరు టీనేజర్ల గురించి అభ్యంతరకరంగా మాట్లాడవద్దని నిపుణులు సూచిస్తున్నారు. నెట్టింట జరిగే ట్రోలింగ్ ను తట్టుకోలేక వారు నిజంగానే ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
