Indian Railways on Tatkal booking (image credit:Canva)
Viral

Indian Railways on Tatkal booking: అదంతా ఫేక్.. ఆ వార్తలు నమ్మొద్దన్న ఇండియన్ రైల్వే..

Indian Railways on Tatkal booking: రైల్వే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే కీలక ప్రకటన చేసింది. ఎటువంటి అవాస్తవ ప్రకటనలు నమ్మవద్దని, అధికారికంగా ప్రకటన జారీ చేసేంతవరకు అవాస్తవాలను ప్రయాణికులు పట్టించుకోవద్దని ఇండియన్ రైల్వే సూచించింది. ఇంతకు ఇండియన్ రైల్వే ఇలా స్పందించడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం.

సాధారణంగా రైల్వే ప్రయాణికులు తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ల కోసం ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఆకస్మికంగా ప్రయాణాలకు సిద్ధమైన సమయంలో తత్కాల్ టికెట్స్ రైల్వే ప్రయాణికులకు ఓ వరంగా చెప్పవచ్చు. అందుకే ఇండియన్ రైల్వే తత్కాల్ టికెట్లను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. అయితే తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ల గురించి ఉదయం నుండి సోషల్ మీడియాలో పలు పోస్టులు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే వాటిపై స్పందించింది.

Also Read: Ram Setu bridge: సముద్ర గర్భంలో రామసేతు? వాట్ ఏ క్రియేషన్..

తాజాగా ఐఆర్సీటిసీ ఎక్స్ ఖాతా ద్వారా ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కీలక సూచన జారీ చేసింది. తత్కాల్ మరియు ప్రీమియం తత్కాల్ టికెట్ల కోసం వేర్వేరు సమయాల గురించి ప్రస్తావిస్తూ పలు సోషల్ మీడియా ఛానల్లో కొన్ని పోస్టులు సర్కులేట్ అవుతున్నాయని, వాటిని నమ్మవద్దని సూచించింది. ఏసీ లేదా నాన్ ఏసీ తరగతులకు తత్కాల్, ప్రీమియం తత్కాల్ బుకింగ్ సమయంలో ప్రస్తుతం అలాంటి మార్పు ప్రతిపాదించబడలేదని, అలాగే ఏజెంట్లకు అనుమతించబడిన బుకింగ్ సమయాలు కూడా మారలేదని ఆ ప్రకటన సారాంశం. ఇండియన్ రైల్వే ఇచ్చిన క్లారిటీతో, ఉదయం నుండి ప్రచారంలో ఉన్న తత్కాల్ టికెట్ల టైమింగ్ మార్పు పై ఓ క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఇండియన్ రైల్వే తెలిపింది.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు