Indian Man (Image Source: Freepic)
Viral

Indian Man: తలరాత మార్చిన లాటరీ.. రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు..

Indian Man: దుబాయ్‌లో పనిచేస్తున్న ప్రవాస భారతీయుడ్ని భారీ అదృష్టం వరించింది. సెప్టెంబర్ 3, 2025న జరిగిన అబూదాబి బిగ్ టికెట్ సిరీస్ 278 డ్రాలో అతను 1.5 కోట్ల దిర్హామ్‌లు (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.35 కోట్లు) గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని ఖలీజ్ టైమ్స్ వార్త సంస్థ వెల్లడించింది. లాటరీ టికెట్ వివరాలను సైతం ప్రకటించింది.

19మందిలో కలిసి కొనుగోలు..
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సందీప్ కుమార్ ప్రసాద్ (30) ఈ జాక్ పాట్ వరించింది. దుబాయ్ డ్రైడాక్స్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తూ గత మూడు సంవత్సరాలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జీవిస్తున్నాడు. ఆగస్టు 19న మరో 19 మందితో కలిసి సందీప్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. దాని నెం. 200669. అయితే ఈ టికెట్ కు అదృష్టం వరించడంతో సందీప్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. మొదటగా బిగ్ టికెట్ నిర్వాహకుల నుండి ఫోన్ రావడంతో అనుమానం వచ్చినా, గెలిచినట్టు ధృవీకరించగానే సందీప్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు.

సందీప్ స్పందన
‘నా జీవితంలో ఇంత ఆనందం ఇదే మొదటిసారి. ఈ బహుమతితో నా కుటుంబానికి అండగా నిలబడతాను. ముఖ్యంగా నాన్న ఆరోగ్య సమస్యలకు సాయం చేస్తాను. భారత్ తిరిగి వెళ్లాక నా స్వంత వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నాను’ అని గల్ఫ్ న్యూస్ ఛానల్ తో సందీప్ అన్నాడు. అంతేకాదు ప్రయత్నిస్తే మీరు కూడా విజయం సాధించవచ్చని పేర్కొన్నాడు.

అతడి వల్లే కలిసొచ్చింది
ఈసారి సందీప్ టికెట్‌ను సబుజ్ మియా అమిర్ అనే వ్యక్తి తీసి ఇచ్చాడు. ఇది సందీప్ కు బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. సబుజ్ దుబాయ్‌లో పని చేసే బంగ్లాదేశ్ టైలర్. ఆయన ఆగస్టు 3న జరిగిన డ్రాలో 20 మిలియన్ దిర్హామ్‌లు గెలుచుకున్నాడు. ఇప్పుడు తన చేతితో సందీప్ కు టికెట్ అందించి.. అతడ్ని కూడా అదృష్టవంతుడిగా మార్చేశాడు.

Also Read: Madhya Pradesh: అత్యంత ఘోరం.. బాలికపై 2 సార్లు అత్యాచారం.. బెయిల్‌పై వచ్చి మరి!

సందీప్ కుటుంబ నేపథ్యం
యూపీకి చెందిన సందీప్ కు ఇప్పటికే వివాహమైంది. ఆయనకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ, తన కుటుంబ భాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ముఖ్యంగా తన తండ్రి అనారోగ్యం గురించి సందీప్ తెగ ఆందోళన చెందుతూ ఉండేవాడు. తన జీవితాన్నే మార్చేసే అదృష్టం వరించడంతో భవిష్యత్తుపై కొత్త ఆశలు వచ్చాయని సందీప్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

Also Read: Hyderabad: గణేష్ నిమజ్జనం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ఆ మార్గాలు క్లోజ్.. అటు వెళ్లారో బుక్కైపోతారు!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం