IND vs PAK Effect: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి దేశంలో విషాదాన్ని నింపింది. పర్యాటకకులనే టార్గెట్ చేస్తూ వారిపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది మృతి చెందారు. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై ఆకంక్షలు విధించింది.
పాకిస్తాన్ నుండి మన దేశానికి డ్రై ఫ్రూట్స్ ను దిగుమతి చేస్తారు. ప్రస్తుతం, వీటికి మన మార్కెట్లలో డ్రై ఫ్రూట్స్ కు డిమాండ్ పెరిగింది. ఇలాంటి సమయంలో, పాకిస్తాన్‌తో వ్యాపార లావాదేవీలు ఆగిపోవడంతో, భారతదేశంలో ఉన్న ఎండిన పండ్లకు ధరలు పెరుగుతాయి. దీని కారణంగా, ఖరీదైనవి మారతాయి.
Also Read: TG 10th Class Results: తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ .. రిజల్ట్స్ వచ్చేది ఆరోజే!
వీటితో పాటు, పాకిస్తాన్ నుంచి సింధు ఉప్పును కూడా భారీగా కొనుగోలు చేస్తారు. సింధు లోయ ఉప్పు పాకిస్తాన్ నుండి మన దేశానికి వస్తుంది. ప్రపంచంలో సింధు ఉప్పు అత్యంత ఖరీదైనదిగా చెబుతారు. అలాగే, మనం వాడే నిత్యావసర ధరలకు కూడా రెక్కలు వస్తాయని అంటున్నారు. మనం వాడే పప్పు, వంట నూనె కూడా ధరలు భారీగా పెరుగుతాయని చెబుతున్నారు. ధరలు ఒకేసారి పెరిగితే, సామాన్యులకు ఇబ్బంది కరంగా ఉంటుంది.
అంతే కాదు, మన దేశంలో కళ్ళద్దాలకు ఉపయోగించే ఆప్టికల్ లెన్స్‌లు కూడా పాకిస్తాన్ నుండి కొనుగోలు చేస్తారు. ఇక్కడ తయారయ్యే ఆప్టికల్స్ కు భారత్ లో భారీగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు, భారత దేశం పాకిస్థాన్ తో సంబంధాలు తెచ్చుకుంటే మన దేశంలో ఉన్న ఆప్టికల్ లెన్స్‌లకు ధరలు విపరీతంగా పెరుగుతాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు