TG 10th Class Results ( Image Source: Twitter)
తెలంగాణ

TG 10th Class Results: తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ .. రిజల్ట్స్ వచ్చేది ఆరోజే!

TG 10th Class Results: తెలంగాణలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు, ఫలితాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంకో వైపు పక్క రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలతోపాటు.. టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. కానీ, తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు దీని గురించి ప్రస్తావన రాలేదు. అయితే, తాజగా విద్యాశాఖ అధికారులు మరో వారంలో పదో తరగతి విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చని చెబుతున్నారు.

మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ వరకు పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాశారు. ఈ పరీక్షలకు మొత్తం 5 లక్షల మంది స్టూడెంట్స్ హాజరయ్యారు. పరీక్షలు రాసి నెలరోజులు అవుతున్నా ఇంకా ఫలితాల విడుదల చేయకపోవడంతో విద్యార్థులతో పాటు తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే, టెన్త్ ఫలితాలను విడుదల చేయాలనీ కసరత్తులు చేస్తోంది.

ఏప్రిల్ 28 లేదా 30 తేదీనా ఫలితాలను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పేపర్ వాల్యువేషన్ మొత్తం పూర్తికాగా.. ఇంటర్నల్ ప్రాసెస్ కూడా పూర్తయింది. దీంతో, ఫలితాలు రిలీజ్ చేసేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి దస్త్రం పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు రెడీగా ఉన్నట్లు సమాచారం.

Also Read: Chiranjeevi: చంద్రబాబు ముందుచూపు వల్లే హైదరాబాద్ విశ్వ నగరమైంది.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలంటే?

1. TS బోర్డు యొక్క సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) ఫలితాలను చూడటానికి మీరు క్రింద ఇవ్వబడిన స్టెప్స్ ను ఫాలో అవ్వాలి.

2. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను bse.telangana.gov.inలో చూడండి.

3. “SSC మార్చి 2025 పరీక్ష ఫలితాలు” ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఫలితాల పేజీ డిస్ ప్లే అవుతుంది.

4. చివరిగా మార్క్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, మీ రోల్ నంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా సబ్జెక్ట్ వారీగా మార్కులను చూసుకోవచ్చు.

Also Read: NVSS Prabhakar: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. బీజేపీ నేత పహల్ గావ్ దాడిని గుర్తు చేస్తూ హెచ్చరిక!

మార్క్‌షీట్ & ఉత్తీర్ణత సర్టిఫికేట్

తెలంగాణ BSE మార్చి 2025 సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఫలితాలతో కూడిన మార్క్‌షీట్‌ను అందిస్తుంది. కానీ అది అసలైనది కాదు. ఆన్‌లైన్ ఫలితం వచ్చిన కొన్ని వారాలలోపు, మీ పాఠశాల విద్యార్థులకు వారి అసలు మార్క్‌షీట్‌తో పాటు తాత్కాలిక ఉత్తీర్ణత సర్టిఫికేట్‌ను అందిస్తుంది. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత మార్క్‌షీట్‌ల పొందవచ్చు. విద్యార్థులు మే 2025లో ఒరిజినల్ మార్క్‌షీట్‌ను తీసుకోవచ్చు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!