jobs ( Image Source: Twitter)
Viral

IBPS RRB Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో 13,217 పోస్టులు..

IBPS RRB Recruitment 2025: బ్యాంకింగ్ రంగంలో మీ కెరీర్‌ను నిర్మించుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) విడుదల చేసిన ఈ అద్భుతమైన అవకాశం మీ కోసమే. గ్రామీణ బ్యాంకుల్లో (RRB) 13,217 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి IBPS నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21, 2025తో ముగియనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

విద్యార్హతలు

ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన అర్హత ఉండాలి.
ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన అర్హత ఉండాలి.
ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్): జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్: ఏదైనా విభాగంలో కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 50% మార్కులతో డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు.
లా ఆఫీసర్: లా విభాగంలో కనీసం 50% మార్కులతో డిగ్రీ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు.

Also Read: CM Revanth Reddy: పాలమూరు జిల్లాలో విద్య వైద్యం సాగు నీటి ప్రాజెక్టులు పూర్తికి ప్రాధాన్యం.. సీఎం రేవంత్ రెడ్డి

చార్టెడ్ అకౌంటెంట్/ఫైనాన్స్ మేనేజర్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫైడ్ అసోసియేట్ లేదా ఫైనాన్స్‌లో MBA.
మార్కెటింగ్ ఆఫీసర్: మార్కెటింగ్‌లో MBA.
అగ్రికల్చర్ ఆఫీసర్: అగ్రికల్చర్, హార్టికల్చర్, డైరీ, యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, లేదా పిసికల్చర్‌లో 50% మార్కులతో డిగ్రీ.

ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్): ఏదైనా విభాగంలో కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన అర్హత.

Also Read: Chikoti Praveen: కవిత భాగస్వామ్యం లేకుండా అవినీతి జరిగిందా?.. చికోటి ప్రవీణ్ ఘాటు వ్యాఖ్యలు

వయోపరిమితి

ఆఫీస్ అసిస్టెంట్: 18-28 సంవత్సరాలు.
ఆఫీసర్ స్కేల్-I: 18-30 సంవత్సరాలు.
ఆఫీసర్ స్కేల్-II: 21-32 సంవత్సరాలు.
ఆఫీసర్ స్కేల్-III: 21-40 సంవత్సరాలు.
నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Also Read: Strange incident: కన్నె పిల్లనని మస్కా కొట్టిన 52 ఏళ్ల మహిళ.. నిజం తెలిసి లేపేసిన 26 ఏళ్ల కుర్రాడు!

ఎంపిక విధానం

ఆఫీస్ అసిస్టెంట్: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు.
ఆఫీసర్ స్కేల్-I: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూ.
ఆఫీసర్ స్కేల్-II & III: సింగిల్ లెవల్ పరీక్ష, ఇంటర్వ్యూ.

ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆలస్యం చేయకండి. అర్హత ఉన్నవారు వెంటనే https://www.ibps.in/ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మీ బ్యాంకింగ్ కెరీర్‌కు బీజం వేసే సమయం ఇదే.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం