Hyderabad Police Dance: శాంతి భద్రతల స్థాపనకు పోలీసులు ఎంతగా కృషి చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రజల శ్రేయస్సు కోసం కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి నిత్యం విధుల్లో కష్టపడుతుంటారు. దొంగలు, హంతకులు, రౌడీ షీటర్లను పట్టుకునే క్రమంలో అలుపు, సొలుపు లేకుండా విధులు నిర్వహిస్తుంటారు. అటువంటి పోలీసులు.. విధి నిర్వహణలోని ఒత్తిళ్లను కాస్త పక్కన పెట్టి సరాదాగా డ్యాన్స్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..
కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన విక్రమ్ (Vikram) చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ (Anirudh Ravichander) సమకూర్చిన పాటలు.. సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘విక్రమ్.. విక్రమ్’ అంటూ సాగే టైటిల్ సాంగ్ కు చాలా మంది ఫిదా అయ్యారు. అలాంటి పాటకు హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) స్టెప్పులేసిన దృశ్యాలు ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చాలా ప్రొఫెషనల్ గా డ్యాన్స్ చేశారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
డ్యాన్స్ ఎలా చేశారంటే?
వైరల్ అవుతున్న వీడియోలో ఒక సీఐ, ఆరుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు. ముగ్గురు చొప్పున కానిస్టేబుల్స్ ఇరువైపులా నిలబడగా మధ్యలో సీఐ ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు. డ్యాన్స్ ప్రారంభంలో సీఐ వెనుక వైపు తిరిగి ఉండగా.. ఆరుగురు కానిస్టేబుల్స్ కింద కూర్చొని ఉన్నారు. విక్రమ్ పాట మెుదలుకాగానే కానిస్టేబుల్స్ నెమ్మదిగా లేచి.. సీఐ చుట్టూ తిరిగి ఎలివేషన్స్ ఇచ్చారు. అనంతరం సీఐ కళ్లకు అద్దాలు, చేతిలో గన్ పట్టుకొని స్టైల్ గా ముందుకు నడుచుకుంటూ వచ్చారు. అలా సీఐ నిలబడి ఉండగా.. వెనుకవైపున ఆరుగురు కానిస్టేబుల్స్ నిలబడి చేతులను చాచడం హైలెట్ గా నిలిచింది. మెుత్తంగా పోలీసుల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కమల్ హాసన్ విక్రమ్ సినిమాలోని సాంగ్ కి డ్యాన్స్ చేసిన హైదరాబాద్ పోలీసులు pic.twitter.com/LKWqo2WgV4
— BIG TV Breaking News (@bigtvtelugu) November 22, 2025
Also Read: KTR Prosecution Report: కేటీఆర్ ప్రాసిక్యూషన్ రిపోర్ట్.. నమ్మలేని నిజాలను.. బయటపెట్టిన ఏసీబీ!
గతంలోనూ ఇలాగే..
హైదరాబాద్ పోలీసులు ఇలా డ్యాన్స్ చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో పోలీసులు నృత్యం చేసి సందడి చేసిన ఘటనలు ఉన్నాయి. ఈ ఏడాది హైదరాబాద్ లో జరిగిన గణేశ్ నిమజ్జన ఉత్సవాల్లో ఏసీపీ సంజయ్ డ్యాన్స్ చేసిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆయనతో పాటు పలువురు పోలీసులు డ్యాన్స్ చేయడం అక్కడి వారిలో జోష్ నింపింది. 2023 హైదరాబాద్ గణేశ్ శోభాయాత్ర సందర్భంగా ఓ కానిస్టేబుల్ తన స్టెప్పులతో ఇరగదీశారు. డీజే డప్పులకు ఆనందం పట్టలేక.. డివైడర్ పైకి ఎక్కి అద్భుతంగా డ్యాన్స్ చేశారు. తనలోని టాలెంట్ ను అందరికీ చూపించి ప్రశంసలు అందుకున్నారు.
