Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) 2024లో తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి, అతడు ఆమెతో రిలేషన్‌లో ఉన్నాడు, ఈమెతో తిరుగుతున్నాడంటూ ఊహాగానాలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి వార్త మరొకటి చక్కెర్లు కొడుతోంది. డిజైనర్ మహీక శర్మతో పాండ్యా రిలేషన్‌లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో హాట్ హాట్ డిబేట్ జరుగుతోంది. దీపావళి సందర్భంగా వీరిద్దరూ మ్యాచింగ్ కలర్ డ్రెస్‌లో కనిపించడం ఈ ప్రచారాన్ని మరింత ఆజ్యం పోసింది. ఓ దీపావళి ఈవెంట్‌కు హాజరైన వీరిద్దరూ ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించారు. పాండ్యా కుర్తా ధరించగా, మహీక ఎరుపు రంగు బంధాని సల్వార్ సూట్‌లో మెరిసిపోయింది.
ఈ నెల మొదట్లో కూడా ఇద్దరూ ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు. వారిద్దరూ కలిసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో, రిలేషన్ ఉన్నారంటూ బాగా చర్చ జరిగింది. హార్దిక్ గతంతో తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్‌లో కూడా ఆమెతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. అందుకే, ఇంతలా ప్రచారం జరుగుతోంది.
ఎవరీ మహీక శర్మ?
మహీక శర్మ ఒక ఫ్యాషన్ డిజైనర్. ముంబై కేంద్రంగా ఆమె పనిచేస్తున్నారు. తనిష్క్, వివో, యూనిక్లో వంటి పెద్ద కంపెనీలకు యాడ్స్ చేసింది. ఇండియన్ ఫ్యాషన్ వరల్డ్‌లో దిగ్గజాలైన అనితా డోంగ్రే, రీతు కుమార్, తరుణ్ తాహిలియాని, మనీష్ మల్హోత్రా, అమిత్ అగర్వాల్ వంటి అగ్రశ్రేణి డిజైనర్ల దగ్గర ఆమె పనిచేసింది. ఎన్నోసార్లు ర్యాంప్ వాక్స్ కూడా చేసింది. ఇక, హార్ధిక్ పాండ్యా విషయానికి వస్తే, నటాషా స్టాంకోవిచ్ 2020లో కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో పెళ్లి చేసుకున్నాడు. కానీ, అనూహ్యంగా గతేడాది జులైలో విడిపోతున్నట్టు ఇద్దరూ ప్రకటించారు. నాలుగేళ్ల జంట ప్రయాణం తర్వాత నటాషా, తాను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని ప్రకటనలో పాండ్యా పేర్కొన్నాడు.
తమవంతు ప్రయత్నించాం, కానీ విడిపోవడమే మంచిదని నమ్ముతున్నామని పేర్కొన్నాడు. కలిసి కుటుంబాన్ని నిర్మించుకున్న సమయం, పంచుకున్న ఆనందం, పరస్పర గౌరవం వీటన్నింటి మధ్య ఇది కష్టమైన నిర్ణయేనని పాండ్యా రాసుకొచ్చాడు. తమకు అగస్త్య (కొడుకు) ఉన్నాడని, తమ ఇద్దరి జీవితాలకు కేంద్రంగా ఉంటాడని పాండ్యా వివరించాడు. తామిద్దరం అతనికి సంతోషాన్ని ఇవ్వడానికి చేయగలిగినదంతా చేయడానికి కలిసి తల్లిదండ్రులుగా వ్యవహరిస్తామని పాండ్యా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
