Gujarat lawyer: చట్టాలను అమలు చేయడంలో న్యాయ స్థానాలు కఠినంగా వ్యవహరిస్తుంటారు. దారితప్పిన వ్యక్తులకు సరైన శిక్ష విధించడం ద్వారా మరోమారు ఆ తప్పు జరగకుండా చూసుకుంటాయి. అందుకే న్యాయస్థానాల విషయంలో ప్రభుత్వాధినేతల నుంచి సామాన్యుల వరకూ అందరూ బాధ్యతగా వ్యవహరిస్తుంటారు. అయితే అన్ని తెలిసిన ఓ లాయర్ మాత్రం.. బాధ్యతారహితంగా ప్రవర్తించడం చర్చలకు తావిస్తోంది. గుజరాత్ హైకోర్టులో ఓ లాయర్.. న్యాయమూర్తి ఎదుటే బీర్ కొడుతూ కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే?
గుజరాత్ హైకోర్టులో జూన్ 25న ఓ కేసుకు సంబంధించి వర్చువల్ విచారణ జరిగింది. జస్టిస్ సందీప్ భట్ (Justice Sandeep Bhutt) ఆన్ లైన్ సెషన్ లో కేసును విచారిస్తుండగా సీనియర్ న్యాయవాది భాస్కర్ తన్నా (lawyer Bhaskar Tanna) తన ఇంటి నుంచే వాదనలు వినిపించారు. ఈ క్రమంలో జడ్డి కేసు గురించి మాట్లాడుతున్న క్రమంలో ఆయన బీర్ మగ్ లాగా కనిపించే గాజు గ్లాసులోని డ్రింక్ తాగుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఒక్కసారిగా బయటకు రావడంతో.. అవి వైరల్ గా మారాయి.
Senior advocate Bhaskar Tanna sipping beer during virtual proceedings of the Gujarat High court. pic.twitter.com/ffSmfd6Rhl
— Piyush Rai (@Benarasiyaa) July 1, 2025
కోర్టుదిక్కారం కింద చర్యలు
అయితే వర్చువల్ విచారణ సందర్భంగా లాయర్ భాస్కర్ తన్నా బాధ్యతారహితంగా వ్యవహరించడాన్ని గుజరాత్ హైకోర్ట్ (Gujarat High Court) సీరియస్ గా తీసుకుంది. న్యాయమూర్తులు ఎ.ఎస్. సుపెహియా (A.S. Supehia), ఆర్.టి వచ్చాని (R.T. Vachhani)లతో కూడిన డివిజెన్ బెంచ్.. తన్నాపై కోర్టు దిక్కారణ చర్యలకు ఆదేశించింది. లాయర్ చర్యలు న్యాయవ్యవస్థ గౌరవన్ని దెబ్బతీయడమే కాకుండా.. న్యాయవాద వృత్తి కూడా చిన్నబోయేలా ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు లాయర్ భాస్కర్ తన్నాపై చర్యలు తీసుకోవాలని కోర్ట్ రిజిస్ట్రీకి డివిజెన్ బెంచ్ సూచించింది.
Also Read: Ban on Pak: విరుచుకుపడ్డ నెటిజన్లు.. కంగారుపడ్డ కేంద్రం.. పాక్‌పై మళ్లీ నిషేధం!
రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే అతడు ఫోన్ లో మాట్లాడటం, బీర్ తాగడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయని డివిజన్ బెంచ్ (High Court Division Bench) పేర్కొంది. ప్రజల నుంచి వస్తోన్న తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా అతడిపై చర్యలు తీసుకోకుండా విస్మరించలేమని పేర్కొంది. భాస్కర్ తన్నా సీనియర్ న్యాయవాది హోదాను సైతం పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని బెంచ్ అభిప్రాయపడింది. ఈ ఘటనపై మరింత విచారణ జరిపి రెండు వారాల్లోగా నివేదికను సమర్పించాలని రిజిస్ట్రీని డివిజన్ బెంచ్ ఆదేశించింది.