Google Map: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అవ్వడంతో.. అదిగో ఫలానా చోట ప్రమాదం జరిగిందని మనం నిత్యం వార్తల్లో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇప్పటి వరకూ జరిగిన సంఘటనలు ఓ లెక్క.. ఇప్పుడు జరిగింది మాత్రం మరో లెక్క. ఈ విషయం తెలిశాక.. బహుశా గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని రోడెక్కాలంటే భయపడిపోతారేమో..! ఇంకా చెప్పాలంటే గూగుల్ మ్యాప్‌కు ఓ దండం అంటూ.. జన్మలో జోలికెళ్లరు అంతే..! ఇంకెందుకు ఆలస్యం చకచకా ఈ కథనం చదివేయండి మరి. పూర్తి వివరాల్లోకెళితే.. మహారాష్ట్ర (Maharastra) నుంచి నలుగురు యువకులు తిరుపతికి (Tirupati) కారులో బయల్దేరారు. దూరం ఎక్కువ కావడం, రూట్ ఐడియా లేకపోవడంతో గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ వెళ్లారు. మ్యాప్ దారి చూపిస్తోంది కదా.. తప్పు ఏమీ ఉండదు కదా? అని గుడ్డిగా ఫాలో అయ్యారు. ఈ క్రమంలోనే ఊహించని ప్రమాదం చోటుచేసుకున్నది. జనగామ జిల్లా వడ్డకొండ వద్ద అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిపై నుంచి అర్ధరాత్రి కారు పడిపోయింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. అరుపులు, కేకలు వినిపించడంతో.. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేసి.. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ నలుగురి యువకుల పరిస్థితి నిలకడగానే ఉన్నది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చూశారుగా.. గూగుల్ మ్యాప్స్ వంటి నావిగేషన్ యాప్‌లను గుడ్డిగా నమ్మితే.. పరిస్థితి ఎలా ఉంటుందనేది మరోసారి గుర్తుచేసిందన్న మాట.
Read Also- Viral Video: ఫ్లైఓవర్‌పై యువకుల చిల్లర చేష్టలు.. రెడ్ హ్యాండెండ్‌గా పోలీసుల డ్రోన్‌కు చిక్కి..!
ఎందుకిలా..?
సాధారణంగా.. గూగుల్ మ్యాప్స్ మన గమ్యస్థానానికి సులభమైన, వేగవంతమైన మార్గాన్ని చూపిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అయితే, కొన్నిసార్లు అప్‌డేట్ కాని సమాచారం, నెట్‌వర్క్ సమస్యలు లేదా ఇతర సాంకేతిక లోపాల వల్ల తప్పుడు దారులు (రాంగ్ రూట్స్) చూపించే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ ప్రత్యేక సందర్భంలో, మూసివేసిన లేదా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గురించి మ్యాప్‌కు సరైన సమాచారం లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి వెళ్తుండగా, మార్గమధ్యలో ఉన్న బ్రిడ్జి మూసివేయబడిందని లేదా అసంపూర్తిగా ఉందని గుర్తించకపోవడంతో.. నేరుగా కారు పైనుంచి కింద పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి.. కొన్నిసార్లు మ్యాప్ డేటా పాతది అయి ఉండవచ్చని చెప్పుకోవచ్చు. రోడ్ల నిర్మాణం, మూసివేతలు లేదా వన్ వే మార్పులు జరిగినప్పుడు, గూగుల్ మ్యాప్స్‌లో ఆ మార్పులు వెంటనే అప్‌డేట్ కాకపోవచ్చని టెక్నికల్ నిపుణులు చెబుతున్నారు. అరుదుగా, జీపీఎస్ సిగ్నల్ సమస్యలు లేదా సాఫ్ట్‌వేర్ లోపాల వల్ల కూడా తప్పుడు మార్గాలు చూపించవచ్చు. పొగమంచు లేదా భారీ వర్షాలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో డ్రైవర్లు మార్గాన్ని స్పష్టంగా చూడలేకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
గూగుల్ మ్యాప్స్ లేదా ఇతర నావిగేషన్ యాప్‌లు ఎంతో ఉపయోగకరమైనప్పటికీ, వాటిని ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కేవలం మ్యాప్‌ను మాత్రమే ఆధారపడకుండా, రోడ్డు సంకేతాలను, చుట్టూ ఉన్న వాతావరణాన్ని, స్థానిక పరిస్థితులను గమనించండి. మీకు ఏదైనా మార్గం గురించి సందేహం ఉంటే.. రోడ్డుపై వెళ్తున్న లేదా.. ఆయా ప్రాంతాల్లో వాహనం ఆపి స్థానికులను అడిగి తెలుసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా.. రాత్రిపూట లేదా సరిగా కనిపించని ప్రదేశాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ను అతిగా చూడటం వల్ల దృష్టి మళ్లి ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ మన ప్రయాణాలను సులభతరం చేసినప్పటికీ, సురక్షితమైన ప్రయాణం కోసం మన సొంత అవగాహన, జాగ్రత్త చాలా అవసరం.
తప్పుపట్టడానికీ లేదబ్బా!
గూగుల్ వంటి సంస్థలు మ్యాప్ డేటాను నిరంతరం అప్డేట్ చేస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోడ్డు మార్పును తక్షణమే నమోదు చేయడం అసాధ్యం. ఒక కొత్త వంతెన నిర్మాణం, పాత వంతెన కూల్చివేత, లేదా ఒక రోడ్డు శాశ్వతంగా మూసివేయబడినప్పుడు, ఆ సమాచారం మ్యాప్‌లో వెంటనే అప్‌డేట్ కాకపోవచ్చు. ఈ సందర్భంలో, బ్రిడ్జి లేని ప్రాంతాన్ని మ్యాప్ ఇంకా మార్గంగా చూపిస్తూ ఉండవచ్చు. కొన్నిసార్లు, పట్టణ ప్రాంతాల్లో లేదా సిగ్నల్ సరిగ్గా లేనిచోట్ల జీపీఎస్ (GPS) ఖచ్చితత్వం తగ్గుతుంది. ఇది డ్రైవర్‌ను అసలు మార్గం నుంచి.. కొద్దిగా పక్కకు దారి మళ్ళించే అవకాశం ఉంది. తద్వారా వారు ప్రమాదకరమైన మార్గంలోకి ప్రవేశించవచ్చు. డ్రైవర్లు మ్యాప్‌పై పూర్తిగా ఆధారపడటంతో కనిపించిన దారినల్లా గుడ్డిగా ఫాలో అవుతుంటారు, చుట్టుపక్కలా పరిసరాలను సరిగా గమనించరు. రాత్రిపూట లేదా మారుమూల ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న లేదా మారుతున్న మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో మ్యాప్ అప్డేట్లు వెనుకబడటం సర్వసాధారణమే. గూగుల్ మ్యాప్స్ వంటి నావిగేషన్ సంస్థలు ఈ సమస్యలను తగ్గించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయని యాజమాన్యం చెబుతున్నది.
Read Also- Heart Attack: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే గుండెపోటు ఖాయం!
కొంపముంచిన గూగుల్ మ్యాప్.. బ్రిడ్జి పైనుంచి పడిపోయిన కారు
గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ కారులో వెళ్లిన కొందరు యువకులు బ్రిడ్జిపై నుంచి వాగులో పడిపోయారు. జనగామ (D) వడ్డకొండలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మహారాష్ట్ర నుంచి తిరుపతికి కారులో బయలుదేరిన యువకులు గూగుల్… pic.twitter.com/lIHUJpKA5d
— ChotaNews App (@ChotaNewsApp) July 5, 2025