Patrolling Drones
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Viral Video: ఫ్లైఓవర్‌పై యువకుల చిల్లర చేష్టలు.. రెడ్ హ్యాండెండ్‌గా పోలీసుల డ్రోన్‌‌కు చిక్కి..!

Viral Video: కొందరు యువకులు ఎక్కడ పడితే అక్కడ.. ఏది పడితే అది చేసేస్తూ మరీ సిల్లీగా తయారవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా (Social Media) వినియోగం ఎక్కువైన తర్వాత.. రీల్స్ కోసం చేయకూడని పనులన్నీ చేసేస్తున్న పరిస్థితి. దీంతో చివరికి సీన్ మొత్తం రివర్స్ అయ్యి పోలీసుల చేతిలో తాట తీయించుకుంటున్న పరిస్థితి. దెబ్బకు దేవుడా.. ఇక జన్మలో ఇలా చేయను బాబోయ్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. పూర్తి వివరాల్లోకెళితే.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు డ్రోన్ పెట్రోలింగ్‌లో యమా స్పీడ్ మీద ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా చాలు నిమిషాల్లో తెలుసుకోవడానికి, అవాంఛనీయ సంఘటనలను చోటుచేసుకోకుండా.. శాంతి భద్రతలను పరిరక్షించడానికి నిత్యం డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి జిల్లాలో తుమ్మలగుంట ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకుల (Youngers) హల్‌చల్ చేశారు. వాహనదారులకు పదే పదే ఇబ్బంది కలిగిస్తున్నట్లు పెట్రోలింగ్ డ్రోన్ (Patrolling Drones) గుర్తించింది. ఇదంతా గమనించిన యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరోసారి ఇలా వాహనదారులను ఇబ్బందిపెట్టినా, రోడ్లపైన చిల్లర చేష్టలు చేస్తే తాట తీస్తామని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఇలాంటి చేష్టలు చేయడానికి కూడా భయపడేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read Also- Vishwambhara vs OG: అన్న‌ద‌మ్ముల మధ్య బాక్సాఫీస్ వార్‌ తప్పదా?

ఎందుకీ డ్రోన్లు..?
వాస్తవానికి.. తిరుపతి జిల్లాలో డ్రోన్ పెట్రోలింగ్ అనేది కేవలం నిఘా కోసం మాత్రమే కాకుండా, వివిధ నేరాలను అరికట్టడానికి ఒక ముఖ్యమైన సాధనంగా మారిందని చెప్పుకోవచ్చు. పోలీసులు ఈ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, గతంలో గుర్తించడం కష్టమైన అనేక అసాంఘిక కార్యకలాపాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఉదాహరణకు, నిర్మానుష్య ప్రదేశాలలో జరుగుతున్న నాటుసారా తయారీ, గంజాయి సాగు, గుండాట, పేకాట వంటి కార్యకలాపాలను డ్రోన్‌ల ద్వారా పసిగట్టి, అప్పటికప్పుడు దాడులు చేసి నిందితులను పట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా.. పోలీసులు ఈ డ్రోన్‌లను ప్రధానంగా రైల్వే ట్రాక్‌లు, నగర శివార్లలోని ఖాళీ ప్రదేశాలు, అటవీ ప్రాంతాలు, నదీ తీరాలు వంటి మారుమూల ప్రాంతాలపై నిఘా పెట్టడానికి ఉపయోగిస్తున్నారు. ఈ ప్రదేశాలు నేరగాళ్లకు ఆశ్రయం కల్పించేందుకు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటాయి. డ్రోన్‌ల ద్వారా ఈ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించడం వల్ల నేరగాళ్లు పారిపోవడానికి లేదా దాక్కోవడానికి అవకాశం లేకుండా పోతుంది. కాగా, తిరుపతి జిల్లా పోలీసులు టెక్నాలజీని నేర నియంత్రణలో చురుకుగా వాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. వారు మ్యాట్రిక్స్ ఫోర్ థర్మల్ డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. ఇవి రాత్రిపూట కూడా స్పష్టంగా దృశ్యాలను బంధించగలవు. ఈ థర్మల్ ఇమేజింగ్ డ్రోన్‌లు చీకట్లోనూ మనుషుల కదలికలను గుర్తించగలవు. ఇది రాత్రిపూట జరిగే అసాంఘీక కార్యకలాపాలను పట్టుకోవడంలో చాలా సహాయపడుతుంది.

Tirupati Police

భవిష్యత్ ప్రణాళికలు
తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు (Harshavardhan Raju) నేతృత్వంలో ఈ డ్రోన్ పెట్రోలింగ్ మరింత విస్తరిస్తున్నది. భవిష్యత్తులో కూడా ఈ డ్రోన్లను పండుగలు, పెద్ద సమావేశాలు, జాతరల వంటి రద్దీ ప్రదేశాల్లో భద్రతా పర్యవేక్షణకు, ట్రాఫిక్ నియంత్రణకు విస్తృతంగా ఉపయోగించనున్నారు. ఇది పోలీసు బలగాలపై భారాన్ని తగ్గించడంతో పాటు, మరింత సమర్థవంతమైన భద్రతా వ్యవస్థను నిర్మించడానికి సహాయపడుతుంది. ప్రజల భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు డ్రోన్లు ఒక అనివార్య సాధనంగా మారనున్నాయి. ముఖ్యంగా.. గంజాయి వినియోగం, నాటుసారా తయారీ, పేకాట, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, బైక్ రేసింగ్ (Bike Racing), అర్ధరాత్రి బర్త్ డే (Birth Day) పార్టీలు వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే.. పోలీసు బలగాలు అన్ని ప్రాంతాలకు చేరుకోలేవు. డ్రోన్ల వినియోగం ద్వారా తక్కువ బలగంతో ఎక్కువ ప్రాంతాలను పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. మరోవైపు ఈ డ్రోన్లు ట్రాఫిక్ నియంత్రణకు కూడా సహాయపడుతున్నాయి. డ్రోన్ల నిఘా వల్ల నేరగాళ్లలో భయం నెలకొని, నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని చెప్పుకోవచ్చు. డ్రోన్లు అనుమానాస్పద కదలికలను లేదా నేరాలను వెంటనే గుర్తించి పోలీసులకు సమాచారం అందించడం ద్వారా సత్వరమే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మారుమూల ప్రాంతాలకు వేగంగా చేరుకుని నిఘా పెట్టడం సులభం కావడం వల్ల పోలీసుల సమయం, శ్రమ పడాల్సిన అక్కర్లేదు. పోలీసుల ఈ కొత్త ప్రయత్నం ప్రజల మద్దతును పొందుతోంది. సాంకేతికత ఉపయోగించి ప్రజలకు భద్రత కల్పించడంలో ఇది గొప్ప ముందడుగుగా పరిగణిస్తున్నారు.

Read Also- KCR: యశోద ఆస్పత్రికి కేసీఆర్.. ఇంతకీ ఏమైంది?

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?