Rapid Weight Gain: సాధారణంగా జిమ్ కు వెళ్లేవారు కండలు తిరిగిన దేహంతో చాలా ఫిట్ గా కనిపిస్తారు. ఆ బాడీని మెయిన్ టెన్ చేయడానికి వారు రోజు గంటల కొద్ది శ్రమిస్తుంటారు. అదే సమయంలో ఆహార నియమాలనూ ఎంతో కఠినంగా పాటిస్తుంటారు. అయితే చాలమంది బరువు తగ్గినప్పటికీ ఎల్లకాలం అలాగే ఉండిపోరు. కొద్దికాలంలోనే వారు మళ్లీ బరువు పెరుగుతుంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? కొందరికి సన్నగా ఫిట్ గా మారడం ఎందుకు కష్టతరంగా మారుతుంది? అనే ప్రశ్నలకు కాలిఫోర్నియాలో పనిచేస్తున్న గాస్ట్రోఎంటరాలజిస్ట్ (Gastroenterologist) డాక్టర్ పలనియప్పన్ మనిక్కం (Dr Palaniappan Manickam) సమాధానం ఇచ్చారు.
కొవ్వు కణాలే కారణం..
కొందరు బరువు తగ్గినప్పటికీ తిరిగి లావు కావడంపై డాక్టర్ పలనియప్పన్ మనిక్కం సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. డైట్ లేదా జిమ్ తర్వాత బరువు మళ్లీ పెరగడానికి కారణం శరీరంలోని కొవ్వు కణాలు అని ఆయన వివరించారు. ఇవి గాలి తగ్గిన బెలూన్‌లా చిన్నవవుతాయి కానీ పూర్తిగా మాయం కావని స్పష్టం వివరించారు.
వీడియోలో ఏం చెప్పారంటే..
‘డైట్ చేసిన తర్వాత మళ్లీ బరువు పెరిగామని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మీ తప్పు కాదు. ఇది మీ కొవ్వు కణాల వల్ల తప్పు. డైట్ చేస్తే, తక్కువ కాలరీలు తీసుకుంటే కొవ్వు కణాలు చిన్నవవుతాయి. కానీ అవి మాయం కావు. అవి కేవలం గాలి తగ్గిన బెలూన్‌లా ఖాళీ అవుతాయి. మీరు మళ్లీ ఎక్కువ తినడం మొదలు పెట్టగానే, అవి మళ్లీ గాలి నిండిన బెలూన్‌లా పెద్దవవుతాయి. అందుకే మీరు తగ్గించిన బరువు.. వేగంగా తిరిగి వస్తుంది’ అని డాక్టర్ పలనియప్పన్ మనిక్కం అన్నారు.
టీనేజ్ డిసైడ్ చేస్తోంది..
గాస్ట్రోఎంటరాలజిస్ట్ మాట్లాడుతూ.. ‘కౌమార దశ తర్వాత శరీరంలోని కొవ్వు కణాల సంఖ్య స్థిరంగా మారిపోతాయి. కాబట్టి చిన్ననాటి లేదా యవ్వనంలో అధిక బరువు ఉన్నవారికి ఎక్కువ సంఖ్యలో కొవ్వు కణాలు ఉండే అవకాశం ఉంటుంది. ‘చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మీ శరీరం మీ టినేజ్ తర్వాత కొత్త కొవ్వు కణాలను తయారు చేయడం ఆపివేస్తుంది. కాబట్టి మీరు మీ టీనేజ్ సమయంలో అధిక బరువుతో ఉంటే మీలో బహుశా ఇతరుల కంటే ఎక్కువ కొవ్వు కణాలు ఉండవచ్చు. అందుకే జీవితంలో ప్రారంభంలో అధిక బరువు ఉన్న వ్యక్తులు యుక్తవయస్సులో తమ బరువును నియంత్రించడం కష్టతరంగా భావిస్తారు. అలాంటి వారు చాలా వేగంగా కొవ్వును కోల్పోయినప్పుడు ఆ కొవ్వు కణాలు ఆహారం కోసం కేకలు వేయడం ప్రారంభిస్తాయి. అందుకే క్రాష్ డైట్‌లకు కట్టుబడి ఉండటం వారికి అసాధ్యంగా అనిపిస్తుంది’ అని అన్నారు.
View this post on Instagram
Also Read: Tamannaah Bhatia: హీరోయిన్స్ కాస్మెటిక్ సర్జరీలపై ప్రశ్న.. బుర్రబద్దలయ్యే ఆన్సర్ ఇచ్చిన తమన్నా!
షార్ట్ కట్స్ వద్దు..
కాబట్టి ఒకేసారి కాకుండా స్థిరంగా బరువు తగ్గేందుకు ప్రయత్నించాలని డాక్టర్ పలనియప్పన్ అన్నారు. రోజువారీ జీవితంలో చురుకుగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలవాటు చేసుకోవాలని సూచించారు. దీనిని కొన్ని నెలల పాటు మాత్రమే పాటించే తాత్కాలిక ప్రక్రియలా కాకుండా జీవిత విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు ఫిట్ నెస్ కోచ్ రజ్ని సింగ్ సూచించిన 5 స్టెప్స్ ఫాలో కావాలని పలనియప్పన్ అన్నారు. ‘మీ శరీరాన్ని మార్చుకోవాలని నిజంగా సీరియస్‌గా ఉన్నట్లయితే ట్రెండ్‌లు, షార్ట్‌కట్‌లు కాదు, మౌలికమైన ఆరోగ్యకరమైన అలవాట్లే అసలైన పరిష్కారం. ఇవే స్థిరమైన, దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తాయి’ అని వివరించారు.
Also Read This: Dharmasthala Case: ధర్మస్థల కేసులో ఆసక్తికర పరిణామం.. ప్రత్యక్ష సాక్షికి సిట్ కీలక ఆదేశాలు!
గమనిక: మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా వార్తను అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.