Dhoni Viral Video: మహేంద్ర సింగ్ ధోనీ .. పేరు వినగానే ప్రతి భారత క్రికెట్ అభిమానికి గర్వం, ప్రేమ, భావోద్వేగం కలగలిపిన భావం. ‘కెప్టెన్ కూల్’గా పేరు తెచ్చుకున్న ఈ లెజెండరీ క్రికెటర్ కేవలం మైదానంలోనే కాదు, ఆఫ్‌ఫీల్డ్‌లో కూడా తన సింప్లిసిటీతో, ఆటోమొబైల్ కలెక్షన్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాడు. ధోనీ రాంచీ నివాసం అనేది కార్లు, బైక్‌ల ప్రేమికులకు స్వర్గధామం లాంటిదే అని అభిమానులు అంటుంటారు. ఈ నేపథ్యంలో ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.
ఫ్యాన్ బైక్‌పై ధోనీ సంతకం – వీడియో వైరల్
ఒక అభిమాని తన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్‌పై ధోనీ సంతకం కోరగా, మాజీ కెప్టెన్ చిరునవ్వుతో అంగీకరించాడు. వీడియోలో ధోనీ బైక్‌ను ఆసక్తిగా పరిశీలించి, సంతకం చేసేముందు “నడిపి ఎలా ఉందో చెప్పు” అని సరదాగా అడగడం అందరినీ ఆకట్టుకుంది. ఆ క్షణం ఆ ఫ్యాన్‌కి జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకంగా మారింది.
సోషల్ మీడియా హల్‌చల్
ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే వైరల్ అయి 52 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్లతో ముంచెత్తారు. ఒకరు “ఎంత అదృష్టవంతుడు!” అని కామెంట్ చేయగా, మరొకరు “ఈ బైక్ రూ.3 లక్షల నుంచి రూ.30 కోట్ల విలువ దాకా వెళ్లిపోయింది” అంటూ సరదాగా పేర్కొన్నారు. ధోనీ స్వయంగా కూడా ఆ వీడియోకు స్పందిస్తూ “Ride with Mahi?” అంటూ కామెంట్ చేయడం అభిమానుల్లో మరింత ఉత్సాహం రేపింది.
Also Read: National Education Day 2025: నేషనల్ ఎడ్యుకేషన్ డే.. మన దేశంలో ఈ రోజు ఎందుకు అంత ముఖ్యమో తెలుసా?
ఫ్యాన్స్ ఎమోషనల్ కామెంట్స్
ధోనీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. “మన చిన్ననాటి హీరోలు వయసు పెరుగుతుండటం చూడటం కొంచెం బాధేస్తోంది” అని ఒకరు భావోద్వేగంగా రాశారు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు మాత్రం కామెంట్స్ సెక్షన్‌లో “Thala for a reason!” అంటూ తమ కామెంట్స్ చేశారు.
