Maharashtra Govt: 1300 మంది గ్రామస్థులకు.. 27,000 సంతానం!
Maharashtra Govt (Image Source: twitter)
Viral News

Maharashtra Govt: అమ్మబాబోయ్.. 1300 మంది గ్రామస్థులకు.. 3 నెలల్లో 27 వేల మంది సంతానం!

Maharashtra Govt: మహారాష్ట్రలోని ఓ గ్రామంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. సుమారు 1300 మంది మాత్రమే ఉన్న ఆ ఊరిలో ఏకంగా 27,000 జననాలు నమోదైనట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదయ్యాయి. అటు మరణాలు సైతం గణనీయంగా ఉన్నట్లు రికార్డయ్యాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) సాఫ్ట్ వేర్ రికార్డుల్లో జరిగిన అవతకతలపై దర్యాప్తు బృందాన్ని సిద్ధం చేసింది.

మహారాష్ట్రలోని యావత్మల్ గ్రామం (Yavatmal Village)లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సీఎస్ఆర్ ద్వారా ఏకంగా 27 వేల జననాలు, భారీగా మరణ ధ్రువపత్రాలు జారీ చేయండం తీవ్ర చర్చకు దారితీసింది. గ్రామంలోని వాస్తవ జనాభాకు ఈ లెక్కలు ఆమడ దూరం ఉండటాన్ని చూసి ఉన్నతాధికారులు సైతం అవాక్కయ్యారు. జనన, మరణాల డిజిటల్ రిజిస్ట్రేషన్ లో భారీగా అవకతవకలు జరిగాయని నిర్ధారించుకున్నారు.

Also Read: Yuvraj Singh Hyd Visit: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన యువరాజ్.. నేడే ‘బిగ్ అకాడమీ’ ప్రారంభోత్సవం

3 నెలల వ్యవధిలోనే గ్రామంలో 27,398 మంది జన్మించినట్లు డిసెంబర్ నాటి సీఎస్ఆర్ డేటా పేర్కొందని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. దీనిపై సైబర్ ఏడీజీ పర్యవేక్షణలో హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు సభ్యులుగా ఉన్న సిట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. డిజిటల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థల సమగ్రతను నిర్దారించడం, ప్రజల విశ్వాసాన్ని కాపాడటం, లోపాలను సరిదిద్దడం దిశగా సిట్ దర్యాప్తు కొనసాగనున్నట్లు తెలియజేశారు. బాధ్యులని గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం నుంచి సిట్ కు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. త్వరలోనే సిట్ బృందం షెండుర్సాని గ్రామ పంచాయతీలో పర్యటించనుంది.

Also Read: Noida Woman: ఇదేం విచిత్రం.. భర్తకు బట్టతల ఉందని.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

Just In

01

CM Chandrababu Naidu: పోలవరానికి అడ్డుపడడం కరెక్టేనా? గోదావరి మిగులు జలాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

YS Jagan on CM Chandrababu: స్వలాభం కోసం.. జన్మనిచ్చిన సీమకే అన్యాయం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

SKN Comments: ఇండస్ట్రీ పెద్దలకు ఎస్కేఎన్ ఓ విన్నపం.. ‘ది రాజాసాబ్’ థియేటర్లు ఇవ్వండి..

Telangana Politics: ఆ మూడు పార్టీల్లోనూ ఇదే వైఖరి.. హద్దులు మీరుతున్న నేతల విమర్శలు!

BRS Party: గ్రామాల్లో పట్టు సడలకుండా గులాబీ నేతల విశ్వ ప్రయత్నాలు.. క్యాడర్ ఆ పార్టీ చేతికి చిక్కకుండా ప్లాన్!