Viral Video: అమ్మబాబోయ్.. ఆకాశం నుంచి ఊడిపడ్డ మేఘాలు!
Viral Video (Image Source: Twitter)
Viral News, లేటెస్ట్ న్యూస్

Viral Video: అమ్మబాబోయ్.. ఆకాశం నుంచి ఊడిపడ్డ మేఘాలు.. మీరూ చూసేయండి!

Viral Video: ప్రతి ఒక్కరూ ఉదయం లేచింది మొదలు.. నిద్రపోయే వరకు ఏదో ఒక సమయంలో ఆకాశాన్ని చూస్తూనే ఉంటాం. ఆకాశంలో కనిపించే మేఘాలను చూసి చాలా సందర్భాల్లో మైమరిచిపోయి కూడా ఉంటాం. అయితే మేఘాలను దగ్గరగా చూడాలన్న కోరిక చాలా మందికి సర్వ సాధారణంగానే ఉంటుంది. కొందరు విమానంలో ప్రయాణించడం ద్వారా మేఘాలను దగ్గరగా చూస్తుంటారు. మరికొందరు ఎత్తైన పర్వతాలు ఎక్కడం ద్వారా మేఘాలకు దగ్గరగా వెళ్తుంటారు. అలా కాకుండా మేఘమే మన దగ్గరకు వస్తే? పొరపాటున నేల మీద పడిపోతే? ఎలా ఉంటుంది. అదెలా సాధ్యమని అనుకుంటున్నారు కదా. కానీ అది సాధ్యమైనట్లు తెలిపే ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మేఘాలు వచ్చి భూమి మీద పడినట్లుగా చూపించే వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో అచ్చం మేఘంలాంటి ఆకారం పంటపొలాల్లో పడి ఉండటాన్ని చూడవచ్చు. అచ్చం ఆకాశంలో మనం మేఘాలను ఎలాగైతే చూస్తామో.. అదే విధంగా అవి ఉన్నాయి. వాటిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం కూడా వీడియోలో గమనించవచ్చు. అక్కడికి వచ్చిన ప్రజలు తెల్లటి మేఘాలను చూసి ఆశ్చర్యపోవడాన్ని చూడవచ్చు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న దానిపై మాత్రం స్పష్టత లేదు.

Also Read: Sania Mirza’s Sister: యూపీఐ వాడుతున్నారా? ఈమె చేసింది పాటిస్తే బోలెడంత డబ్బు ఆదా!

అయితే వీడియోను చూసిన నెటిజన్లు దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అవి నిజమైన మేఘాలు కావని పేర్కొంటున్నారు. అది కేవలం నురగ మాత్రమేనని అంటున్నారు. మరికొందరు దీనిని ఏఐ మాయాజాలంగా చెప్పుకొస్తున్నారు. ఎవరో కావాలనే ఏఐతో మేఘాలు సృష్టించి.. ఇలా వీడియోను వైరల్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మేఘాలు పడినదానిని సమర్థిస్తున్నారు. నిజమైన మేఘాలు కాకపోతే అంతమంది అక్కడ ఎందుకు గుమ్మికూడతారని ప్రశ్నిస్తున్నారు. మెుత్తంగా మేఘాలు భూమి మీద పడ్డాయంటూ జరుగుతున్న ప్రచారం.. నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Also Read This: Himachal Pradesh’s Kullu: హిమాచల్‌లో అకస్మిక వరదలు.. సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి!

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం