Sania Mirza’s Sister: ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా (Sania Mirza) సోదరి ఆనమ్ మిర్జా (Anam Mirza) పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డబ్బును ఎలా ఆదా చేశానో చూడండి అంటూ ఆమె పెట్టిన పోస్ట్ కు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అంతలా ఆనమ్ మిర్జా ఏం చేసింది? ఆమె డబ్బు ఆదా కోసం ఎంచుకున్న మార్గం ఏంటి? ఇప్పుడు చూద్దాం.
గూగుల్ పే డిలీట్ చేశా
ఆనమ్ మిర్జా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. యూపీఐ యాప్స్ వాడటం ఆపేశానని అందులో పేర్కొంది. రోజువారీ ఖర్చులు తగ్గించుకోవడం కోసం గూగుల్ పే (Google Pay)ని కూడా డిలీట్ చేశానని వీడియోలో చెప్పుకొచ్చింది. QR కోడ్‌లను స్కాన్ చేయకుండా లేదా తక్షణ చెల్లింపులు చేయకుండా తనను తాను నియంత్రించుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ నిర్ణయంతో చాలా వరకూ డబ్బును ఆదా చేయగలిగినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు తన లిటిల్ ఛేంజెస్, బిగ్ ఇంపాక్ట్ ఎపిసోడ్ 4లో ఆమె ఈ వీడియో షేర్ చేశారు.
View this post on Instagram
తొలినాళ్లలో ఇబ్బంది పడ్డా
చిన్నమార్పులు.. పెద్ద ప్రభావం అంటూ తన నిర్ణయాన్ని ఆనమ్ మిర్జా సమర్థించుకుంది. స్కాన్ లేదు = తక్కువ ఖర్చు అంటూ వీడియోలో తెలిపింది. తన డబ్బు ఎక్కడికి పోతుందో ఇప్పుడు తనకు మరింత అవగాహన వచ్చిందని ఆనమ్ చెప్పింది. ఈ నిర్ణయం తీసుకున్న తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమేనని.. తన ఫ్రెండ్స్ ను కాఫీ కొనివ్వమని అడగాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పారు. కాల క్రమేణా ఈ మార్పునకు అలవాటు పడ్డానని.. ప్రస్తుతం అది ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు.
Also Read: Himachal Pradesh’s Kullu: హిమాచల్‌లో అకస్మిక వరదలు.. సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి!
నెటిజన్లు ఏమంటున్నారంటే!
మరోవైపు ఆనమ్ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది. ఆమె నిర్ణయం చాలా మంది నెటిజన్లను ఆకర్షించింది. మంచి డెసిషన్ తీసుకున్నారంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. డబ్బును ఆదా చేసుకునేందుకు మంచి మార్గం చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ కాలంలో మీరు తీసుకున్న నిర్ణయం.. నిజంగా గొప్ప మార్పు అని ప్రశంసిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆనమ్ నిర్ణయాన్ని తప్పు బడుతున్నారు. మీరు ధనవంతులు కాబట్టి సరిపోయిందని.. తమ లాంటి మధ్యతరగతి వ్యక్తులకు యూపీఐ ఎంత సౌకర్యంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.