Water: నీరు తాగడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, రోజులో ఎంత శాతం నీటిని తాగాలో మనలో చాలా మందికి తెలియదు. అయితే, కొంతమంది నీటిని ఎక్కువగా తాగుతారు, మరి కొందరు నీటిని తక్కువగా తాగుతారు.
Also Read: Bonalu Festival: బోనాల జాతరకు రూ.20కోట్లు.. ఏర్పాట్ల కోసం నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం!
నీటిని అధికంగా తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్స్ చెబుతున్నారు. అయితే, కొందరు అదే పనిగా.. ఐదు లీటర్ల నీటిని తాగుతుంటారు. ఇలా తాగాల్సిన అవసరం లేదు. మన శరీరం యొక్క బరువు, ఆరోగ్య పరిస్థితులను బట్టి వాటర్ ను తీసుకోవాలని డాక్టర్స్ చెబుతున్నారు. ఒక వ్యక్తి రోజులో 2 నుంచి 2.5 లీటర్ల నీటిని తాగాలని చెబుతున్నారు.
Also Read: Thummala Nageswara Rao: కమిషన్‌కు ఈటల చెప్పిందంతా అబద్దం.. నా పేరు ఎందుకు తీశారు.. తుమ్మల ఫైర్!
రోజులో కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలని అంటున్నారు. అంతకు మించి తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని పరిశోధనలు చేసిన నిపుణులు చెబుతున్నారు. ఇక కొంతమంది జ్యూస్ లు కూడా తాగుతుంటారు. వీటిని కూడా నీటిని తాగినట్టే అనుకుంటారు. కూల్ డ్రింక్స్, జ్యూస్ లు తాగిన కూడా ఐదు లీటర్లకు మించి తీసుకోకూడదు. ఇలా అధిక నీటిని ఎక్కువగా తీసుకోవడం వలన పొట్ట పెరుగుతుంది. అలాగే, శరీరంలో వాపు సమస్యకు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.