Alappuzha Gymkhana Still
ఎంటర్‌టైన్మెంట్

Alappuzha Gymkhana: డేట్ మార్క్ చేసుకోండి.. ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్‌లో ఉండే చిత్రం ఓటీటీలోకి వస్తోంది!

Alappuzha Gymkhana: ఓటీటీలు వచ్చిన తర్వాత ఆ భాష, ఈ భాష అని తేడా లేకుండా ప్రేక్షకులు సినిమాలను చూస్తున్నారు. ఇది గమనించిన నిర్మాతలు ఆ సినిమా ఏ భాషలో తెరకెక్కినా, అన్ని భాషలలో రెడీ చేసి ఓటీటీలకు తెస్తున్నారు. దీంతో కంటెంట్‌కు రిచ్‌నెస్, రీచ్‌నెస్ పెరుగుతోంది. సినిమాలో ఏ మాత్రం కంటెంట్ ఉన్నా సరే.. ఓటీటీ వీక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. ఇప్పుడలాంటి చిత్రమే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. క‌డుపుబ్బా న‌వ్వెందుకు రెడీగా ఉండండి అంటూ.. మేకర్స్ ఈ చిత్ర ఓటీటీ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఇంతకీ ఏ సినిమా అది? ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్‌కి వస్తుందనే వివరాల్లోకి వెళితే..

స్పోర్ట్స్, కామెడీ, డ్రామా వంటి ఎలిమెంట్స్‌తో థియేట‌ర్స్‌లో‌కి వచ్చి ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన‌ మ‌ల‌యాళ చిత్రం ‘అలప్పుళ జింఖానా’. ఇప్పుడీ సినిమా ఓటీటీలో ఆడియెన్స్‌ను అలరించటానికి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సిద్ధమైంది. ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీ మాధ్యమంలో ఎక్స్‌క్లూజివ్‌గా జూన్‌13 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్, సదరు ఓటీటీ యాజమాన్యం అధికారిక ప్రకటనను విడుదల చేశారు. మరెందుకు ఆలస్యం.. సోనీ లివ్‌లో ‘అల‌ప్పుళ జింఖానా’ చిత్రాన్ని చూడ‌టానికి మీ క్యాలెండ‌ర్‌లో జూన్‌13ను మార్క్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది కేవలం సినిమాయే కాదు, కడుపబ్బా న‌వ్విస్తూనే జీవిత పాఠాలను సైతం నేర్పిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

Also Read- Akhil Wedding: కొడుకులతో కలిసి కింగ్ నాగ్ ఏ పాటలకు డ్యాన్స్ చేశారో తెలుసా?

‘అల‌ప్పుళ జింఖానా’ కథ విషయానికి వస్తే.. జోజో జాన్సన్ (నస్లెన్) ప్రధాన పాత్రలో నటించారు. ఆయన ఇందులో ఓ కాలేజీ విద్యార్థిగా కనిపిస్తున్నారు. ఎంతో ముచ్చటపడి త‌న‌కు న‌చ్చిన కాలేజీలోకి స్పోర్ట్స్ కోటా ద్వారా జాయిన్ కావటానికి బాక్సింగ్‌లో చేరతాడు. ఇక్కడే కథ అస‌లు మలుపు తీసుకుంటుంది. జోజో జాన్సన్ తన స్నేహితులతో కలిసి అసలు బాక్సింగ్‌ను నేర్పించే కోచ్ ఆంటోనీ జోషువా (లుక్‌మాన్ అవరాన్)ను కలిసినప్పుడు.. ఆయన పట్టుదల, శ్రమ, బాక్సింగ్‌లో త‌గిలే నిజమైన దెబ్బల గురించి చెబుతాడు. దీని కోసం జోజో జాన్సన్ ఎంచుకున్న షార్ట్ క‌ట్ ప్ర‌యాణంలో త‌న‌ను తాను తెలుసుకుని క‌ష్ట‌ప‌డతాడు. దీంతో ఆ జ‌ర్నీ అత‌నికొక మ‌రుపురానిదిగా మారుతుంది. కానీ, అతను చేసే ప్రయత్నాలన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అవేంటనేది తెలుసుకోవాలంటే మాత్రం కచ్చితంగా సినిమా చూడాల్సిందే.

Also Read- Celebrity Engagement: నిర్మాత అజయ్ మైసూర్‌తో నటి నిశ్చితార్థం.. ఫొటోస్ వైరల్

ఈ సినిమా ఓటీటీలోకి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని నస్లెన్ మాట్లాడుతూ.. ‘అలప్పుళ జింఖానా’ చిత్రంలో నేను పోషించిన జోజో పాత్ర మంచి అనుభూతినిచ్చింది. ఈ పాత్ర‌లో న‌టించ‌టం ద్వారా నాలోని బ‌ల‌హీన‌త‌లు, బ‌లాల‌ను తెలుసుకోగ‌లిగాను. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావ‌టం చాలా సంతోషంగా ఉంది. జూన్ 13న సోనీ లివ్ ద్వారా యావ‌త్ దేశం ఈ చిత్రాన్ని వీక్షించ‌బోతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వం వహించటంతో పాటు జాబిన్ జార్జ్, సమీర్ కరాట్, సుబీష్ కన్నంచేరితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గణపతి ఎస్. పొడువాల్, సందీప్ ప్రదీప్, అనఘా రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, బేబీ జీన్, శివ హరిహరన్ తదితరులు ఇతర పాత్రలలో నటించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు