Akash Deep: భారత యువ పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ (Akash Deep: ) ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్-ఇండియా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. అనుభవం పెద్దగా లేకపోయినప్పటికీ టీమ్ విజయాలలో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన ఆకాశ్ దీప్ 13 వికెట్లు పడగొట్టాడు. ఒకసారి 4 వికెట్లు, మరొకసారి 5 వికెట్ హాల్ సాధించాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. ముఖ్యంగా ఐదో టెస్ట్‌లో తన బ్యాటింగ్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ‘కెన్నింగ్టన్ ది ఓవల్’ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన ఆకాశ్ దీప్ ఎవరూ ఊహించని రీతిలో హాఫ్ సెంచరీ బాదాడు. 66 పరుగులు జోడించి ఔట్ అయ్యాడు. టీమిండియాలో చోటు సంపాదించి అందరి ప్రశంసలు అందుకుంటున్న ఆకాశ్ దీప్ వ్యక్తిగతంగా ఒక కలను నిజం చేసుకున్నాడు.
అండర్సన్-టెండూల్కర్ సిరీస్ ముగిసిన తర్వాత, మిగతా ఆటగాళ్లతో పాటు స్వదేశానికి వచ్చిన ఆకాశ్ దీప్ తన ‘కారు కల’ను సాకారం చేసుకున్నాడు. తన డ్రీమ్ కార్‌ను కొన్నాడు. తన కుటుంబసభ్యులను తీసుకెళ్లి మరీ కలను నెరవేర్చుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి కారు ముందు ఫొటోలు కూడా దిగాడు. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘‘కల నెరవేరింది. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వారితో కలిసి కారు తాళాలు అందుకున్నాను’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. నల్లరంగు టయోటా ఫార్చ్యూనర్ కారును కొనుగోలు చేసినట్టుగా ఫొటలోను బట్టి అర్థమవుతోంది. ఈ కార్ టాప్ మోడల్ ధర రూ.62 లక్షల కంటే ఎక్కువగా ఉంటుందని కార్‌దేఖోడాట్‌కామ్ తెలిపింది.

సూర్యకుమార్ యాదవ్ శుభాకాంక్షలు
ఆకాశ్ దీప్ డ్రీమ్ కార్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, వెంటనే దీనిపై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించిన ప్రత్యేక అభినందనలు తెలిపాడు. ‘‘బహుత్ బహుత్ బధాయీ’’ అంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. కాగా, ఇంగ్లండ్-ఇండియా టెస్ట్ సిరీస్‌లో చివరి ఆకాశ్ దీప్ రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు సాధించాడు. అందులో 12 బౌండరీలు ఉన్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి మూడో వికెట్‌కు అత్యంత కీలకమైన 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడీ అద్భుతంగా ఆడడంతో తర్వాతి బ్యాటర్లకు చక్కటి పునాది పడింది. మిగతా ఆటగాళ్లు కూడా ఆత్మవిశ్వాసంతో ఆడారు.
Read Also- Wasim Akram – Siraj: మహ్మద్ సిరాజ్‌పై పాక్ మాజీ దిగ్గజం పొగడ్తల జడివాన
సంజయ్ బంగర్ ప్రశంసలు
సిరీస్‌లో ఆకాశ్ దీప్ అద్భుత ప్రదర్శనపై ప్రశంసలు జల్లు కురుస్తూనే ఉంది. భారత మాజీ బ్యాట్స్‌మన్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ, ఆకాశ్ దీప్ మొదటి ఓవర్‌లో బెథెల్‌పై షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడని, కానీ, ఆ తర్వాత చాలా పరిణితితో ఆడాడని మెచ్చుకున్నాడు. ఒక ప్రొఫెషనల్ బ్యాటర్ మాదిరిగా ఆడాడని, బ్రిస్బేన్ టెస్టులో కూడా ఫాలో-ఆన్ నుంచి భారత్‌ను రక్షించాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. బంతులు బౌన్స్ అయినా భయపడలేదని, ధైర్యంగా ఆడాడని ఆకాశ్ దీప్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఫీల్డర్లు దగ్గరగా ఉన్నప్పుడు షాట్లు ఆడడానికి ప్రాధాన్యత ఇచ్చాడని, ఫీల్డింగ్ వెనక్కి ఉన్నప్పుడు డిఫెన్స్ ఆడాడని ప్రశంసించాడు. ఇక, వికెట్ల మధ్య చక్కగా రన్స్ తీశాడని, ఆకాశ్ దీప్‌తో భాగస్వామ్యం నెలకొల్పడంతో యశస్వి జైస్వాల్ పాత్ర కూడా కీలకమైనదేనని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. ఆకాశ్ దీప్ ఏకగ్రతతో ఆడేలా జైస్వాల్ చొరవ చూపాడని, భాగస్వామ్యాన్ని కొనసాగేందుకు సపోర్ట్ ఇచ్చాడని మెచ్చుకున్నాడు. మొత్తంగా ఐదవ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ద్వారా ఆకాశ్ దీప్ ఆల్‌రౌండ్ సామర్థ్యం నిరూపితమైందని పేర్కొన్నాడు.
Read Also- Shubman Gill: శుభ్‌మన్ గిల్ క్రేజ్ మామూలుగా లేదు… జెర్సీ వేలం వేస్తే…