Mohammed-Siraj
Viral, లేటెస్ట్ న్యూస్

Wasim Akram – Siraj: మహ్మద్ సిరాజ్‌పై పాక్ మాజీ దిగ్గజం పొగడ్తల జడివాన

Wasim Akram – Siraj: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇటీవలే ముగిసిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అత్యుత్తంగా రాణించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఇరు జట్లలోనూ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. సిరీస్‌లో మొత్తం 185.3 ఓవర్లు వేసి 23 వికెట్లు తీశాడు. రెండు సార్లు ఐదు వికెట్ల మైలురాళ్లు సాధించాడు. జస్ప్రీత్ బుమ్రాపై శారీరక శ్రమను తగ్గించే ప్రణాళికలో భాగంగా అతడు మూడు మ్యాచ్‌ల్లోనే ఆడినా.. ఆ లోటు తెలియకుండా సిరాజ్ అద్భుతంగా రాణించాడు. జూనియర్ బౌలర్లతో కలిసి పేస్ బౌలింగ్ సారధ్యం వహించాడు. ఇక, చారిత్రాత్మకమైన ఐదో టెస్టు చివరి రోజున, భారత్ గెలుపునకు 4 వికెట్లు అవసరమవ్వగా, అందులో మూడు వికెట్లు పడగొట్టాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ కేవలం 6 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో, సిరాజ్ ప్రస్తుతం హీరోగా మారిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా సిరాజ్‌పై ప్రశంసలు జట్లు కురుస్తోంది. ఈ జాబితాలో పాకిస్థాన్ దిగ్గజ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ కూడా చేరిపోయాడు.

Read Also- 334 Parries Removed: 334 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం

అత్యుత్తమ బౌలింగ్ ఇదే
ఇంగ్లండ్ పర్యటనలో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ ప్రదర్శనను వసీం అక్రమ్ కొనియాడాడు. ఈ మధ్య కాలంలో తాను చూసిన అత్యుత్తమ బౌలింగ్‌ ఇదేనంటూ మెచ్చుకున్నాడు. ‘‘పనిలో లేనప్పుడు క్రికెట్ చాలా అరుదుగా చూస్తుంటాను. కానీ, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ చివరి రోజున మాత్రం టీవీకి అతుక్కొని ఉన్నాను. సిరాజ్‌లో ఉన్న పట్టుదల, అతడి అంకితభావం చూసి ఆశ్చర్యం కలిగింది. 5 టెస్టుల్లో ఇంచుమించుగా 186 ఓవర్లు వేసి, చివరి రోజు కూడా అంత సత్తాతో బౌలింగ్ చేయగలగడం అంటే అసాధారణ శారీరక, మానసిక బలాన్ని చాటిచెబుతోంది. ప్రస్తుతం అతడు కేవలం సపోర్ట్ బౌలర్ కాదు. బౌలింగ్‌ను లీడ్ చేస్తూ, మనసు పెట్టి ఆడుతున్నాడు. బ్రూక్ క్యాచ్ వదిలేసినప్పుడు కూడా మహ్మద్ సిరాజ్ ఏకాగ్రతను కోల్పోలేదు. నిజమైన ఫైటర్ లక్షణం అదే. టెస్ట్ క్రికెట్ బతికే ఉంది. చాలా దృఢంగా ఉంది’’ అని వసీం అక్రమ్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు టెలికమ్ ఏసియా స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

Read Also- Karnataka Crime: వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నేరం.. శరీర భాగాలను ముక్కలు చేసి..

ఐదో రోజున భారత్‌కు గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని తాను భావించానని చెప్పాడు. ‘‘5వ రోజున భారత్ గెలిచే అవకాశం 60 శాతం ఉంటుందని అంచనా వేశాను. తొలుత ఒక వికెట్ తీస్తే చాలు అని భావించాను. క్రిస్ వోక్స్ గాయపడడంతో విజయానికి అవకాశం ఉందని భారత్ గ్రహించింది. అందుకే పట్టువీడకుండా ఆడింది. అవకాశాన్ని సిరాజ్ చక్కగా వినియోగించుకున్నాడు’’ అని వసీం అక్రమ్ కొనియాడాడు. కాగా, కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో సిరాజ్ మొత్తం 9 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐదవ మ్యాచ్‌లో గెలుపుతో టీమిండియా సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!