French Open final
Viral, లేటెస్ట్ న్యూస్

French Open final: ఫ్రెంచ్ ఓపెన్ గాఫ్ కైవసం

French Open final: అమెరికా (USA) ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణి కోకో గాఫ్ (Coco Gauff ) ఫ్రెంచ్ ఓపెన్ 2025ను (French Open final) కైవసం చేసుకుంది. శనివారం పారిస్‌లోని రోలాండ్ గారోస్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో బెలారస్ క్రీడాకారిణి అరినా సబలెంకాను (Aryna Sabalenka) వరుస సెట్లలో 7-6, 2-6, 4-6 తేడాతో గాఫ్ ఓడించింది.

Read this- Sonia Gandhi Health: సోనియా గాంధీకి పెరిగిన బీపీ.. తాజా పరిస్థితి ఏంటంటే?

ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీ స్వీకరించిన తర్వాత గాఫ్ మాట్లాడుతూ, ఫ్రెంచ్‌ టెన్నిస్ అభిమానులు తనను ఇంతలా ప్రేమించడానికి తనకు ఉన్న అర్హత ఏమిటో అర్థం కావడంలేదని ఆమె భావోద్వేగంగా స్పందించింది. “ముందుగా నేను దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. గడిచిన కొన్నేళ్లలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాను’’ అని గాఫ్ చెప్పింది. విజేతగా నిలవడం గర్వంగా భావిస్తున్నానని, అరినా సబలెంకా గొప్ప పోరాట యోధురాలు అని, టైటిల్ గెలిచేందుకు ఆమె కూడా సంపూర్ణ అర్హరాలు అని మెచ్చుకుంది. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ చాలా గొప్పగా ఆడారంటూ సబలెంకాను ప్రశంసించింది.

Read this- Viral News: భార్య తల, మొండాన్ని వేరు చేసి.. భర్త కిరాతకం

“నా సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరంతా నా వద్ద ఉండడం సంతోషంగా అనిపిస్తోంది. మీరంతా నన్ను ముందుకు నడిపించారు. కొన్నిసార్లు ఇదంత సులభమైన పని కాదని నాకు బాగా తెలుసు. అందుకే, మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను ఈ టోర్నమెంట్ ఆడడం సుసాధ్యం చేసిన అమెలీకి థ్యాంక్స్. మ్యాచ్ చూడడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీరంతా నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. ఫ్రెంచ్ అభిమానుల నుంచి ఇంత ప్రేమను పొందేందుకు నేను ఏం సాధించానో నాకు తెలియదు. మీ మద్ధతు కృతజ్ఞురాలి. థ్యాంక్యూ పారిస్!” అని గాఫ్ పేర్కొంది.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?