Non Veg: ఆదివారం వస్తే చాలు నాన్ వెజ్ తినాల్సిందే. అలా మనకు మాంసాహారంలో మూడు నుంచి నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇలా మనకీ ఏది తినాలని పిస్తే.. అది తెచ్చకుని తింటాము. అయితే, వీటిలో చికెన్, మటన్, ఫిష్ ను ఎక్కువగా తింటుంటారు. ఈ మూడింట్లో ఏది బెస్ట్ అనేది ఎవరికి తెలియదు. దీని గురించి నిపుణులు ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం..
మాంసాహారం గురించి మాట్లాడేటప్పుడు రెడ్ మీట్, వైట్ మీట్ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. రెడ్ మీట్ అంటే మటన్. వైట్ మీట్ అంటే చేపలు, రొయ్యలు. రెడ్ మీట్‌లో ప్రోటీన్లతో పాటు ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. కానీ, వైట్ మీట్‌లో ప్రోటీన్లు ఉంటాయి.
వీటిలో మటన్ తినడం వలన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే, లివర్ సమస్యలు కూడా వస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇక మటన్ కంటే చికెన్ మంచిదని అని చెప్పాలి. మటన్‌తో పోలిస్తే చికెన్ తింటే హెల్త్ సమస్యలు రావు.
చేపను మనలో ఎక్కువ మంది తింటుంటారు. దీన్నివారంలో రెండు సార్లు తినడం వలన రక్తపోటు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
