Gas-Delivery-Man
Viral, లేటెస్ట్ న్యూస్

Bihar Election 2025: టార్గెట్ ఎమ్మెల్యే లేదా ఎంపీ.. బీహార్‌లో 20 ఏళ్లుగా పోటీ చేస్తున్న గ్యాస్ డెలివరీ మ్యాన్

Bihar Election 2025: కొందరు లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా జీవిత లక్ష్యం కోసం పరితపిస్తూనే ఉంటారు. ఆ కోవకు చెందుతారు బీహార్‌కు చెందిన చోటే లాల్ మహతో అనే వ్యక్తి. ఆయన గ్యాస్ డెలివరీ మ్యాన్‌ను పనిచేస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఎంపీ, లేదా ఎమ్మెల్యే కావడం ఆయన జీవితాశయం. గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తూనే ఆయన తన ప్రయత్నాలు చేస్తున్నారు. గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి రాజకీయ నేతగా మారాలనుకోవడం ఏమిటని ఆశ్చర్యం అనిపించినా.. ఆయన మాత్రం సీరియస్‌గానే తన ప్రయత్నాలు చేస్తున్నారు. గత 20 ఏళ్ల నుంచి బీహార్‌లో (Bihar Election 2025) జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగినా, అసెంబ్లీ ఎన్నికలు జరిగినా కచ్చితంగా పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా పోటీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. గతంలో ఎన్నిసార్లు ఓడినా ఆయనలో ఉత్సాహం మాత్రం అస్సలు తగ్గ లేదు.

నవంబర్ 6, 11 తేదీల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పటిమాదిరిగానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు మహాతో సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. మొదటిసారి 2020లో పోటీ చేసినట్టు చెప్పారు. 2000లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశానని, అప్పుడు తన వయసు 23 ఏళ్లు మాత్రమేనని అన్నారు. వయస్సు పరిమితి కారణంగా అప్పుడు నామినేషన్ తిరస్కరించారని, అయినా నిరుత్సాహపడలేదని గుర్తుచేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు అనేక ఎన్నికల్లో పోటీ చేశానని అన్నారు. సీనియర్ నాయకులైన తస్లీముద్దీన్, మాజీ కేంద్ర మంత్రి సయ్యద్ షహనవాజ్ హుస్సేన్ వంటి వారిపై కూడా పోటీ చేశానని మహాతో చెప్పారు.

Read Also- VC Sajjanar: డ్యూటీలో తప్పులు చేస్తే చర్యలు తప్పవు.. హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరిక!

2004 నుంచి వరుసగా అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఇప్పటివరకు విజయం వరించలేదని విచారం వ్యక్తం చేశారు. విజయం లేకపోయినా ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని, ఈసారి కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని ఓ జాతీయ మీడియా సంస్థతో చెప్పారు. ప్రజల నుంచి చక్కగా మద్దతు లభిస్తోందని, తనను గెలిపించేందుకు విరాళాలు కూడా ఇస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. తాను ఇంటింటికీ గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తుంటానని, ప్రజలు తనలో నాయకత్వ లక్షణాలను చూస్తున్నారని మహతో విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి ఖచ్చితంగా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఓట్లతో గ్యారంటీగా విజయం సాధిస్తానని అన్నారు.

Read Also- Kishan Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కిషన్ రెడ్డి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా?

కిషన్‌గంజ్‌లో ఆయన ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తన ప్రచార ఖర్చుల విషయంలో కుటుంబ సభ్యులు కూడా తోడ్పాటు ఇస్తున్నారని వివరించాడు. విరాళాలతో పాటు, తన భార్య మేకలు, కోళ్లు, కోడిగుడ్లు అమ్మి ప్రచార ఖర్చుకు డబ్బులు సమీకరిస్తోందని మహాతో వివరించారు. తాను బతికినంత కాలం ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని, మానవ సేవే తన లక్ష్యమని చెప్పారు. గెలిస్తే, పేదల కన్నీళ్లు తుడిచేందుకు, అభివృద్ధి కోసం, ఉద్యోగావకాశాలు సృష్టించడానికి కృషి చేస్తానని మహాతో చెప్పారు. తాను ఎప్పుడూ జనాలకు అండగా ఉంటారని, ఈసారి ప్రజలు ఆయనకు అవకాశమిస్తారనే నమ్మకం ఉందని ఆయన భార్య చెప్పారు.

 

 

 

Just In

01

Bigg Boss Telugu Nominations: నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ.. గూస్ బంప్స్ ప్రోమో భయ్యా!

Highest Paid Actors: రెమ్యునరేషన్లలో వెనక్కి తగ్గేదే లే అంటున్న సౌత్‌ యాక్టర్లు..

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం