Bhangarh Fort: రాజస్థాన్ లో ఉన్న భాంగఢ్ కోట గురించి అందరూ వినే ఉంటారు. ఇది ఒక మిస్టీరియస్ ప్రదేశం. ఇక్కడ శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఇక్కడికి ఎవర్ని అనుమతించరు. ఈ కోట చూట్టూ ఎన్నో రహస్య కథలు. భయంకరమైన శబ్ధాలు, అరుపులు వినిపిస్తున్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అంతే కాదు, అక్కడ అదృశ్య శక్తులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. చీకటి పడ్డాక అక్కడికి ఎవరైనా వెళ్తే.. తిరిగి రాలేరని చెబుతున్నారు. మరి, అలా ఎందుకు చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Boys Jeans: జీన్స్‌లను ప్రతిసారీ ఉతకొద్దు.. బయటపడిన షాకింగ్ నిజాలు.. అబ్బాయిలు ఇది మీకోసమే!
అక్కడ స్థానికులు చెబుతున్న కథనాల ప్రకారం, ఒక శక్తివంతమైన తాంత్రికుడు అందమైన రాజుకుమారుడిని చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెను ఎలా అయిన పొందాలనుకుని, తెలిసిన మాయ విద్యాలన్నీ ఉపయోగించి ఆమెను సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. కానీ, రాజకుమారి అతని ప్రయత్నం గురించి తెలుసుకుని అదే మంత్రాన్ని అతని పైన ప్రయోగిస్తుంది. ఒక్క దెబ్బకు ఆ తాంత్రికుడు మృతి చెందాడు.
Also Read: Politics On Tirumala: తిరుమల వేదికగా మళ్లీ రాజకీయ రచ్చ.. టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం!
అతను చనిపోయే ముందు ఆ కోట పై ఒక భయంకరమైన శాపం పెట్టాడు. ఈ కోటలోకి వచ్చిన వారెవరు .. ఎప్పటికీ ప్రశాంతంగా నివశించలేరని శాపం పెట్టాడు. ఇది జరిగిన కొంత కాలానికే అక్కడ ఒక యుద్దం జరిగింది. కోటలో ఉన్న ప్రతి వ్యక్తి చనిపోయాడు. అప్పటి నుంచి కోట నిర్మానుష్యంగా మారింది. కానీ, ఇప్పటికీ కూడా ఆ కోటలో ఏవో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని అంటున్నారు. అంతే కాదు, ఎవరో పేర్లు పెట్టి పిలుస్తున్నారని చెబుతున్నారు.
Also Read: Rakul On Kohli: కోహ్లీ చేసిన ఒక్క లైక్ కి ఏకంగా 2 మిలియన్ల ఫాలోవర్లు.. రకుల్ సంచలన కామెంట్స్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.
