Viral Video: దేశంలోనే టాప్ కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా (Prabhu Deva)కు పేరుంది. ఆయన పాటలకు డ్యాన్స్ చేయాలంటే ప్రొఫెషనల్ డ్యాన్సర్లు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు. ఆ గ్రేస్, స్పీడ్ ను మ్యాచ్ చేయగలమా? లేదా? అని తమను తాము ప్రశ్నించుకుంటారు. అలాంటిది విద్యార్థులకు పాఠాలు చెప్పే ఓ ప్రొఫెసర్.. ప్రభుదేవా సాంగ్ ను ఎంచుకొని.. దుమ్మురేపే డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
బెంగళూరులోని గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ (Global Academy of Technology)కి చెందిన ప్రొఫెసర్ పుష్ప రాజ్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రేమికుడు సినిమాలోని ‘ముక్కాలా ముక్కాబులా’ (Mukkala Mukkabala Song) పాటకు ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ప్రభుదేవా వేసిన ఐకానిక్ స్టెప్పులను అచ్చుగుద్దినట్లు దింపేసి వీక్షకులను ఫిదా చేశారు. ఒక కాలు షూ ఊడినప్పటికీ ఏమాత్రం ఇబ్బంది పడకుండా తన డ్యాన్స్ కొనసాగించాడు. డ్యాన్స్ వేసే క్రమంలో ఎక్కడా పుష్పరాజ్ కష్టపడినట్లు కనిపించలేదు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
View this post on Instagram
నెటిజన్ల స్పందన
ప్రొఫెసర్ పుష్పరాజ్ డ్యాన్స్ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొందరైతే ఆయన్ను ఏకంగా మైఖేల్ జాక్సన్ (Michael Jackson)తో పోల్చారు. ‘డాన్సర్‌గా పుట్టాడు కానీ ప్రొఫెసర్‌గా మారాల్సి వచ్చింది’ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ఇంకొకరు స్పందిస్తూ ‘ఇష్టమైన డ్యాన్స్ ను త్యాగం చేసి.. కుటుంబం కోసం టీచర్ అయ్యాడు’ అని అన్నారు. అయితే ఈ ప్రొఫెసర్ కు సంబంధించి గతంలో ఇంకొక డ్యాన్స్ వీడియో కూడా వైరల్ అయ్యింది. బీట్ బాక్సింగ్ మ్యూజిక్ కు ఆయన చేసిన స్టెప్స్ అప్పట్లో తెగ ఆకట్టుకున్నాయి.
Also Read: TPCC Mahesh Kumar Goud: కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం స్కామ్ సుస్పష్టం.. మామ అలుళ్ల వాటా ఎంతో తేలాలి.. టీపీసీసీ చీఫ్
ఇటీవల ఓ జంట సైతం..
ప్రొఫెసర్ పుష్ప రాజ్ తరహాలోనే ప్రభుదేవ పాటకు ఓ జంట డ్యాన్స్ చేసి ఇటీవల తెగ వైరల్ అయ్యింది. లోకిత్ కుమార్ (Lokith Kumar) అనే వ్యక్తి ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. వీడియోను గమనిస్తే.. ఓ వేడుకలో పాల్గొన్న జంట.. ముక్కాల ముక్కాబుల సాంగ్ కు అదిరిపోయే విధంగా స్టెప్పులు వేసింది. తమ అద్భుతమైన కెమెస్ట్రీతో అక్కడి వారిని ఆకట్టుకుంది. దీంతో ఈ వీడియోను షేర్ చేసిన కొద్దిసేపటికే అది లక్షల్లో వ్యూస్, వేలల్లో కామెంట్స్ ను సాధించింది. వీడియోలో గులాబీ రంగు చీర కట్టిన మహిళ.. సంప్రదాయ తెల్ల పంచెకట్టు, చొక్కా ధరించిన వ్యక్తితో కలిసి ఎంతో ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అక్కడున్న వారు చప్పట్లతో వారిని ప్రోత్సహించారు. ‘మరచిపోలేని క్షణాలను సృష్టిస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన జంటను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని లోకిత్ కుమార్ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.