Jagruthi President Kavitha (Image Source: Twitter)
తెలంగాణ

Jagruthi President Kavitha: కవిత బిగ్ బాంబ్.. హరీశ్ రావు, సంతోష్‌ రావు వల్లే.. కేసీఆర్‌పై అవినీతి మరక

Jagruthi President Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ (KCR) జపం చేస్తోందని ఆరోపించారు. వరదలు వస్తే ఆదుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆక్షేపించారు. తాము ఎంపీలుగా ఉన్నప్పుడు ఆరు నెలల ముందు యూరియా కోసం కేసీఆర్ మమ్మల్ని అలెర్ట్ చేసేవారని గుర్తుచేశారు. కాళేశ్వరం (Kaleshwaram Project) లాంటి తరగని ఆస్తిలో మేడిగడ్డ అనేది చిన్న పార్ట్ మాత్రమేనని కవిత అన్నారు. కేసీఆర్ తెలంగాణకు నీళ్లు తేవడం కోసం 6-7 నెలలు రీసెర్చ్ చేశారని కవిత చెప్పారు.

‘ఎన్ని కుట్రలు చేసినా భరించా’
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తిండి ధ్యాస, డబ్బు ధ్యాస ఉండదని కవిత అన్నారు. కేసీఆర్ పై అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టును 200 ఏళ్లు ప్రజలు గుర్తుంచుకుంటారు. కేసీఆర్ కు అవినీతి మరక ఎట్లా వచ్చిందో బీఆర్ఎస్ శ్రేణులు (BRS Cadre) ఆలోచించాలి. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్ల వల్ల అవినీతి మరక అంటింది. కేసీఆర్ కు అవినీతి మరక అంటించడంలో హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి పాత్ర ఉంది. కేసీఆర్ ను నేడు రేవంత్ రెడ్డి  విమర్శించే పరిస్థితి వచ్చింది. నాపై హరీష్ రావు, సంతోష్ రావు ఎన్ని కుట్రలు చేసినా భరించాను’ అని కవిత అన్నారు.

Also Read: Viral Video: ప్రియుడితో ఏకాంతంగా భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. ముగ్గురూ పోలీసులే!

‘కేసీఆర్ ను బద్నాం చేస్తున్నారు’
మాజీ మంత్రి హరీశ్ రావు వెనక.. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ‘దగ్గర ఉండి అవినీతి అనకొండలు కేసీఆర్ ను బాద్నాం చేస్తున్నారు. నా వెనుక బీజేపీ ఉంది. కాంగ్రెస్ ఉంది అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నాది కేసీఆర్ బ్లడ్. నేను ఇండిపెండెంట్ గా వుంటాను. కేసీఆర్ లాంటి మహానేతపై సీబీఐ విచారణ చేసే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ పై సీబీఐ విచారణ చేసే పరిస్థితి వచ్చింది. ఇక పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత’ అని కవిత అన్నారు.

ట్రోల్ చేస్తే.. తోలు తీస్తా
తనపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే తోలు తీస్తానని కవిత ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ పేరుతో టైం పాస్ చేస్తోంది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ పేరు చెప్పకపోతే పేపర్ లో ఫోటో రాదు. నేను డైరెక్ట్ గా పేర్లు చెప్పిన వారిపై విచారణ చేయండి’ అంటూ కవిత సవాలు విసిరారు. మరోవైపు బీహార్ ఎన్నికల కోసం రాష్ట్రంలోని తెలంగాణ బీసీలను బలి చేస్తున్నారని కవిత ఆరోపించారు. ‘బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేము బీహార్ వెళ్లి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాము. సీబీఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు’ అని కవిత అన్నారు.

Also Read: Viral Video: ఒరేయ్ బుడ్డోడా.. ఎంత పని చేశావ్‌రా.. నీ దెబ్బకు అంతా వణికిపోయారు!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం