Bapatla District: వింత ఘటనలు, వింత దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి వింత ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు, విని ఉండరు. ఔను ఇప్పటి వరకు వేప చెట్టు నుండి పాలు కారడం, నీళ్లు కారడం మాత్రమే మనకు తెలుసు. కానీ ఇది పూర్తిగా అందుకు భిన్నం. ఇంతకు ఏంటా వింత? అసలెక్కడ జరిగింది? తెలుసుకుందాం.
మనం సాధారణంగా వేప చెట్ల నుండి పాలు కారే దృశ్యాలు చూస్తూ ఉంటాం. అలా పాలు కారే వేప చెట్టుకు కొందరు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. మరికొందరు మహిమలు కాదు. ఇది కేవలం వేపచెట్టుకు సోకిన వైరస్ అంటూ కొట్టిపారేస్తారు. అందుకే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కాస్త ఆ దృశ్యాలు వైరల్ గా మారుతుంటాయి. సేమ్ టు సేమ్ ఇది కూడా అలాంటి ఘటనే కానీ, కాస్త వెరైటీ. ఈ వింత తెలుసుకున్న ప్రజలు అక్కడికి పరుగులు పెడుతున్నారు.
అంతేకాదు పూజలు చేస్తూ తమ భక్తితత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఘటన ఏపీలోని బాపట్ల జిల్లా నగరం మండలం పెద్దవరం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..
పెద్దవరంలో గల ఓ వేప చెట్టు నుంచి పసుపు, కుంకుమ పడుతుందంటూ ప్రచారం సాగింది. అరెరె.. వేపచెట్టు నుండి పాలు కారే దృశ్యాలు చూశాం. నీరు కారే దృశ్యాలు చూశాం. కానీ ఏకంగా పసుపు, కుంకుమ పడడం పెద్ద వింతేనని ప్రజలు అక్కడికి క్యూ కట్టారు.
అంతేకాదు ఈ ఘటనకు సంబంధించి మరో ప్రచారం సైతం సాగుతోంది. శ్రీరామనవమి పర్వదినం నుండి ఇదే రీతిలో వేపచెట్టు నుండి పసుపు, కుంకుమ పడుతుందని కూడా ప్రచారం జోరందుకుంది. ఇంకేముంది ఈ వింతను చూసేందుకు ఆ గ్రామస్తులే కాక, ఇతర గ్రామస్తులు కూడా క్యూ కట్టారు. వాక ఏడుకొండలు అనే స్థానికుడి ఇంటి ముందు ఉన్న వేప చెట్టు నుంచి పసుపు, కుంకుమ పడుతుందంటూ గత మూడు రోజులుగా ప్రచారం ఊపందుకుంది.
అయితే ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా వేపచెట్టు నుండి పసుపు, కుంకుమ వస్తుందని విశ్వసిస్తున్నారు. మంగళవారం రాత్రి యజమాని ఏడుకొండలు ఇంటి వద్ద భజనలు కూడా చేశారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక కాలంలో మూఢనమ్మకాల్లో ప్రజలు ఇంకా మగ్గిపోతున్నారని కొందరు తమ అభిప్రాయం తెలుపుతున్నారు.
ఇది ఖచ్చితంగా ఆకతాయిల పని అయ్యి ఉండొచ్చని మరికొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద వేపచెట్టు నుండి పసుపు, కుంకుమ పడుతుందన్న విషయంలో అసలు వాస్తవం వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎవరైనా కావాలని చేస్తున్నారా? లేక అసలు నిజంగా అలా జరుగుతుందా అన్నది అధికారులు తేల్చాలని కొందరు కోరుతున్నారు.
వేప చెట్టు నుంచి పసుపు, కుంకుమ పడుతుందంటూ ప్రచారం..!
బాపట్ల జిల్లా నగరం మండలం పెద్దవరం గ్రామంలో ఘటన
స్థానికుడు వాక ఏడుకొండలు ఇంటి ముందు ఉన్న వేప చెట్టు నుంచి పసుపు, కుంకుమ పడుతుందంటూ గత మూడు రోజులుగా ప్రచారం
ఆదివారం శ్రీరామనవమి నాటి నుంచి ఇలా పడుతుందని, అది దైవ కార్యమేనని… pic.twitter.com/mpjnfpQpuy
— BIG TV Breaking News (@bigtvtelugu) April 9, 2025