Refinery industry in Ap: పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రకటించారు. ఈ అవకాశాలు అందిపుచ్చుకోవడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని తెలిపారు.
ఏపీలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ రాబోతోందని రాష్ట్రానికి తీపికబురు చెప్పారు. ఒడిశా పారాదీప్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీ ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఒడిశా ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది.
Also read: Lady Aghori on Mark Shankar: పవన్ బిడ్డకు ఏం కాదు.. రాత్రి పూజ చేశా.. లేడీ అఘోరీ
ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసి, ఎక్కువ నిల్వ చేస్తామన్నారు. ప్రస్తుతం ఒక్కో బ్యారల్ ముడి చమురు 60 డాలర్ల వరకు ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.