Room for 1 Dollar : ఈ ప్రపంచంలో మనకీ తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిని విన్నా.. చూసినా మనకి కొత్తగా అనిపిస్తుంది. ఇక కొన్ని అయితే ఇది నిజమేనా అన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా వింతగా ఉంటుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
జపాన్ లో అసాహి ర్యోకాన్ అనే ఒక హోటల్ ఉంది. అందులో రూమ్ తీసుకుని, ఒక నైట్ స్టే చేయడానికి కేవలం ఒక డాలర్ మత్రమే ఛార్జ్ చేస్తారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 87 రూపాయలు మాత్రమే. ఇది చాలా చీప్ అనుకుంటున్నారా.. కానీ, ఇక్కడే ఒక మెలిక ఉంది.
Also Read: Manchu Manoj: నాన్న నన్ను క్షమించు.. కన్నప్ప సూపర్ హిట్ అవ్వాలి.. మనోజ్ సంచలన కామెంట్స్
అదేంటంటే.. మీరు రూమ్ లో స్టే చేసే సమయం మొత్తం ఇంటర్నెట్ లైవ్ లైవ్ బ్రాడ్‌కాస్ట్ అవుతారు. బాత్ రూమ్ లాంటి ప్రైవేట్ రూమ్స్ తప్ప .. మిగతా అన్ని ఏరియాల్లో కేమారస్ ఉంటాయి. మీరు పడుకున్నా.. తింటున్న.. వాటర్ తాగుతున్న.. నిలుచున్న .. ఇలా అన్ని ప్రపంచానికి కనిపిస్తాయి. ఈ ప్రయోగాన్ని కస్టమర్స్ ను ఆకట్టుకోవడానికి ఇలా స్టార్ట్ చేశాడు.
Also Read: Mahesh Kumar Goud: కేటీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలి.. పీసీసీ చీఫ్ కీలక కామెంట్స్!
అంతే కాదు, యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్ ద్వారా డబ్బును కూడా సంపాదిస్తున్నాడు. ఇలా ఆ హోటల్ యజమాని రెండు వైపులా కోట్లను వెనకేస్తున్నాడు. ఇది కూడా ఒక రకమైన బిజినెస్. ఇది మీకు వినడానికి వింతగా, షాకింగ్ లా కనిపించిన చాలా మంది టూరిస్టులు ఎగబడుతున్నారు. ఒంటరిగా ఉండాలనుకునే వారికి అందులో రూమ్ బుక్ చేసుకుని స్టే చేస్తున్నారు.
దీనికి సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా ఎక్కడైన ఒక్క రోజూ స్టే చేస్తే వందలకు వందలు ఖర్చు పెట్టాలి. కానీ, ఇక్కడ మాత్రం ఒక డాలర్ అంటే షాకింగ్ లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.