Arrest Virat Kohli: ఐపీఎల్-2025 టైటిల్ (IPL 2025) గెలిచిన ఆర్సీబీ ఆటగాళ్లకు (Team RCB) సన్మాన కార్యక్రమం తలపెట్టగా, అభిమానులు పెద్ద సంఖ్యలో పోటెత్తడంతో ఎం.చిన్నస్వామి స్టేడియం వెలుపల బుధవారం మధ్యాహ్నం తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 11 మంది చనిపోగా, 47 మందికి పైగా గాయపడ్డారు. ఒకపక్క తొక్కిసలాటలో అభిమానులు ప్రాణాలు కోల్పోయాక కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సన్మాన కార్యక్రమం నిర్వహించడంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన కారణంగా ఇప్పటికే ఆర్సీబీ మేనేజర్‌తో పాటు మొత్తం ఆరుగురు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ ఆర్సీబీ ఫ్రాంచైజీపై విమర్శలు ఆగడం లేదు. మేనేజర్‌ను అరెస్ట్ చేస్తే సరిపోదని, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని కూడా (Arrest Virat Kohli) అరెస్ట్ చేయాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
Read this- Unusual Ola Ride: పక్కవీధిలోకి ఓలా బైక్ బుకింగ్.. కారణం విని షాకైన రైడర్
కోహ్లీని అరెస్ట్ చెయ్యండి
తొక్కిసలాట ఘటనలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని కూడా కచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందేనంటూ ‘ఎక్స్’లో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా ‘అరెస్ట్ విరాట్ కోహ్లీ’ టాప్ ట్రెండింగ్‌గా దూసుకెళుతోంది. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో తొక్కిసలాట జరిగితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను (Allu Arjun) అరెస్ట్ చేశారని, అదే మాదిరిగా విరాట్ కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. 2024 డిసెంబర్ 13న జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్‌ను గుర్తుచేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒకే తరహా తొక్కిసలాటలు జరిగాయి కాబట్టి, ఇద్దరి పట్ల ఒకే విధంగా నడుచుకోవాలని, కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అరెస్టైన ఆరు నెలల వ్యవధిలోనే బెంగళూరులో తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు.
కోహ్లీ స్వార్థపరుడు
విరాట్ కోహ్లీ స్వార్థపరుడు అని, చరిత్రలో అస్సలు ఏమాత్రం మానవత్వం, సిగ్గులేని వ్యక్తి అతడంటూ ఓ నెటిజన్ ఘాటు విమర్శలు చేశాడు. అల్లు అర్జున్ మాదిరిగానే అరెస్ట్ చేయాలని ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కోహ్లీ గెలుపు, ఆర్సీబీ సంబరాల కంటే ప్రాణాలు తక్కువయ్యి పోయాయా?, అభిమానుల ప్రాణాలు ముఖ్యంకాదా? అని ప్రశ్నించాడు.
Read this- IPL Star Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన భారత స్టార్ క్రికెటర్
కోహ్లీని ఎందుకు అరెస్ట్ చేయాలి?
చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనకు విరాట్ కోహ్లీని ఎందుకు అరెస్ట్ చేయాలంటూ కొందరు నెటిజన్లు ప్రశ్ని్స్తున్నారు. ఆర్సీబీ తొక్కిసలాట వ్యవహారంలో నిష్పక్షపాతంగా వ్యవహారించాలని కోరుతున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ, “కుంభమేళా-2025 తొక్కిసలాట తర్వాత ఎవర్ని అరెస్ట్ చేశారు?. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎవరు అరెస్టయ్యారు?. విరాట్ కోహ్లీ, అల్లు అర్జున్ లాంటి అమాయకులను మాత్రమే ఎందుకు టార్గెట్‌గా ఎంచుకుంటారు?. డియర్ కోహ్లీ, ఎంజాయ్ ఐపీఎల్ ట్రోఫీ’’ అంటూ రాసుకొచ్చారు. విరాట్ కోహ్లీ అభిమాని మరొకరు స్పందిస్తూ, ‘‘టార్గెట్ చేయడం ఆపండి. ఆర్సీబీ తొక్కిసలాట ఘటనలో విరాట్ కోహ్లీ నిందించాల్సిన వ్యక్తి కాదు. ఆర్సీబీ సంబరాలు విషాదకరమైన తొక్కిసలాటకు దారితీయడానికి కారణమైన పరిస్థితులను సృష్టించిన వ్యక్తులను టార్గెట్ చేయండి. ఇది కూడా అచ్చం అల్లు అర్జున్ కేసు లాంటిదే. రోహిత్ శర్మ అభిమానులు దయచేసి అర్థం చేసుకోవాలి’’ అని పేర్కొన్నాడు.