Offers On iPhone: ఐఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్ కంపెనీ.. మార్కెట్‌లో కొత్త సిరీస్ ఫోన్‌ను ఆవిష్కరించిన ప్రతిసారీ, అంతకుముందు విడుదలైన ఫోన్లు డిస్కౌంట్ ధరలపై (Offers On iPhone) లభిస్తుంటాయి. ఇటీవలే ఐఫోన్17 సిరీస్ విడుదలైన నేపథ్యంలో, ఐఫోన్14 ఫోన్లు మరింత ఆకర్షణీయమైన డిస్కౌంట్ ధరలకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రతి ఏడాది దసరాకు ముందు నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’లో భాగంగా ప్రీమియం మొబైల్ ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా, ఐఫోన్ 14 కేవలం రూ.39,999కే లభించనుందని తెలిపింది. బ్యాంక్ డిస్కౌంట్‌లతో కలిసి ఈ భారీ డిస్కౌంట్ లభ్యమవుతుందని వెల్లడించింది. కాగా, ఐఫోన్ 14 ప్రస్తుత మార్కెట్ ధర రూ.52,990గా ఉంది. సెప్టెంబర్ 2022లో విడుదలైనప్పుడు ఈ ఫోన్ అసలు ధర రూ.79,900గా (ప్రారంభ ధర) ఉండేది.
Read Also- Girls on Married Men: పెళ్లైన మగాళ్లపై అమ్మాయిలు ఎందుకు మోజు పడుతున్నారు? దాని వెనుకున్న కారణాలివే!
ఐఫోన్ 14 (iPhone 14) బేస్ మోడల్ ఫీచర్ల విషయాన్ని 128జీబీ స్టోరేజీతో లభిస్తుంది. బ్లూ, మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, రెడ్ కలర్లలో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్‌లో రూ.39,999లకే (బ్యాంక్ ఆఫర్లతో కలిపి) లభించనుంది. భారత్‌లో ఐఫోన్ 14 మోడల్ విడుదలైన నాటి నుంచి ఇదే అత్యల్ప ధర కానుంది. కాబట్టి తక్కువ ధరకే ఐఫోన్ దక్కించుకోవాలనుకుంటున్నవారికి ఇది బంపరాఫర్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఐఫోన్16పై కూడా ఆఫర్లు..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో కేవలం ఐఫోన్ 14 మీద మాత్రమే కాదు. యాపిల్ కంపెనీకి చెందిన ఇతర ప్రీమియం మోడళ్లపై కూడా భారీ తగ్గింపు ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాచ్‌లపై డిస్కౌంట్లు ఉంటాయని తెలిపింది.
రూ.70 వేల లోపే ఐఫోన్ 16 ప్రో
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో భాగంగా ఐఫోన్ 16 ప్రో మోడల్ ఫోన్ రూ.70,000 కంటే తక్కువ ధరకే లభించనుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ.1,19,900 అని వెల్లడించింది. ఇక, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్ రూ.90 వేల లోపే లభించనుందని తెలిపింది. ఈ ఫోన్ అసలు ధర రూ.1,44,900 అని గుర్తుచేసింది. బెస్ట్ కెమెరా, పెర్ఫార్మెన్స్ కోరుకునేవారు ఈ ఫోన్‌కు ప్రాధాన్యత ఇవ్వవచ్చు.
Read Also- BJP vs Congress: ప్రధాని తల్లి ఏఐ వీడియో రచ్చ.. దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్
సేల్స్ ఎప్పుడు మొదలవుతాయి?
ఫ్లిప్‌కార్డ్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులు వాడేవారు 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. సేల్‌లో స్మార్ట్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, ఇతర అనేక ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉండనున్నాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
Read Also- RBI Recruitment 2025: రూ.78 వేల జీతంతో ఆర్‌బీఐలో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!