Alekhya chitti pickles Image Source Twitter
Viral

Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ మళ్లీ వచ్చింది.. తెరపైకి అబ్బాయి.. కౌంటర్ అదుర్స్..

Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం వెనుక ఇంత జరిగిందా..?

అలేఖ్య చిట్టి పికిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పేరు బాగా వినబడుతోంది. పికిల్స్ నాన్ వెజ్ పచ్చళ్ళకు చాలా ఫేమస్ అయింది. ఇంత ఫేమ్ అయిన వ్యాపారం ఎవరూ ఊహించలేని విధంగా మూసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, తాజాగా అలేఖ్య చెల్లి క్లారిటీ ఇచ్చింది. అసలు ఒక ఆడపిల్ల అయి ఉండి .. అలా ఎలా తిట్టింది? అలా ఎలా భూతులు మాట్లాడిందని అంటున్నారు? కానీ, దీని వెనుక కారణం గురించి ఎవరు మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. ఒక వైపు మాత్రమే చూసి జడ్జ్ చేస్తున్నారు.

అసలేం ఏం జరిగిందంటే..

మేము ఒక రోజులో వేల కొద్దీ మెసేజ్ లు డిలీట్ చేస్తుంటాము. అందులో వచ్చే సగం మెసేజ్ లు బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి. వాటిలో పచ్చి భూతులు తిడుతూ ఇంకా పేరెంట్స్ ను కూడా లాగుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ వస్తున్నాయి. ఇలా వచ్చినప్పుడు మేము బ్లాక్ చేస్తాము. బాగా డీప్ గా తిట్టిన వాళ్ళకి మాత్రమే అక్క రిప్లై ఇచ్చింది. తిట్టిన పర్సన్ కి మెసేజ్ పెట్టబోయి వేరే అతనికి టచ్ అయి ఆడియో వెళ్ళిపోయింది. ఇది అతను తెలుసుకునే లోపు అందరికి ఫార్వర్డ్ చేయడం ఇంత పెద్ద ఇష్యూ అయింది.

Also Read: Sailesh Kolanu: ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ఎలా లీక్ చేస్తారు.. టాలీవుడ్ డైరెక్టర్ సంచలన ట్వీట్

అతనికి సారీ కూడా చెప్పాము!

ఇది మీరు ముందే చెప్పచ్చు కదా అని మీరు మమ్మల్ని అడగొచ్చు కానీ, ఆధారాలు లేకుండా మాట్లాడకూడదని ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాము. వాట్సప్ ఓపెన్ చేస్తుంటే చాలా మంది బ్యాడ్ మెసేజెస్ , ఇంకా అదే పనిగా కాల్స్ చేస్తూనే ఉన్నారు. మొత్తం 35 వేల మంది పైగానే వాట్సప్ రిపోర్ట్ కొట్టారు. దీని వలన మేము ఏం జరిగిందో చూపించలేకపోయాం. వాట్సప్ ను అండర్ రివ్యూ లో పెట్టాము. 24 నుంచి 48 గంటలు టైం తీసుకుంది. ఇంక దాంతో కూడా పని అవ్వదని మాకు అర్ధమయ్యేసరికి బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనను కలిసి సారీ కూడా చెప్పాము. కావాలంటే ఆడియో కూడా వినండి అంటూ వీడియోలో వినిపించారు.

Also Read: Secunderabad railway station: ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ నుంచి రైళ్లు మళ్లింపు.. తెలుసుకోకుంటే చిక్కే!

ఎందుకు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నామంటే?

తను దుర్బాషలాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అదంతా నిజమే.. ఒకరికి పెట్టబోయి మెసేజ్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళింది. దాని వలన పబ్లిసిటీ మొత్తం అయింది. తప్పు చేయని వాళ్ళు ఒక నింద పడాల్సి వచ్చింది. దానికి, వాళ్ళకి సంబంధం లేదు. వేరే వాళ్ళకి వెళ్ళాల్సింది మీకు వచ్చేసింది. అంతకి మించి ఏం లేదు. మేము బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 11 నెలల్లో ఎంత నెగటివిటీ ఫేస్ చేశామో ఎంత అసభ్యకర పదాలు విన్నామో, ఎంత నెట్టుకొస్తున్నామో అనేది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను జరిగిందంతా మీకు చెప్పాను కదా .. మీరు చూసి ఒక యాంగిల్లో ఆలోచించవచ్చు. అలా చెప్తేనే తెలుస్తాది. రోజు ఆడియో ఏదైతే లీక్ అయిందో .. దాన్ని చూసి మీరు మమ్మల్ని తప్పు బట్టారు. మేము మీకు అన్ని సమస్యలు చెప్పలేము అండి. బిజినెస్ అంటే తిట్లు వస్తాయి, పొగడతలు వస్తాయి ఇలా అన్ని దాటుకునే వచ్చాము. ఇలా ఎవరైతే తిట్టారో మొదట్లో మేము భయపడ్డాం కూడా .. అలా తిట్టే వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తామని చెప్తే .. వాళ్ళు మా మీద రివర్స్ అయి మీరు మా మీద కంప్లైంట్ ఇస్తే సుసైడ్ చేసుకుంటున్నామని బెదిరించారు. ఇలా ఒకటి కాదు ఎన్నో ఎదుర్కొన్నామని అలేఖ్య చెల్లి క్లారిటీ ఇచ్చింది.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు