Sailesh Kolanu: ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ఎలా లీక్ చేస్తారు.. టాలీవుడ్ డైరెక్టర్ సంచలన ట్వీట్
Sailesh Kolanu Image Source Twitter
ఎంటర్‌టైన్‌మెంట్

Sailesh Kolanu: ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ఎలా లీక్ చేస్తారు.. టాలీవుడ్ డైరెక్టర్ సంచలన ట్వీట్

Sailesh Kolanu: శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా (nani) ‘హిట్-3’ మన ముందుకు త్వరలో రానుంది. చిత్రంలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) కథానాయికగా నటిస్తుండగా.. వాల్ పోస్టర్ సినిమాస్(Wall Poster Cinemas) పతాకం పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. అయితే, ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మే 1న థియేటర్లో సందడీ చేయనున్నచిత్రం నుంచి కొందరు ట్విస్టుల్ని ముందే లీక్ చేసేశారు. ఇప్పుడు, ఇది హాట్ టాపిక్ గా మారింది. ఒక్క సినిమా తీయడానికి మేము ఎంతో కష్ట పడతాము. కొందరు కష్టానికి కూడా విలువ ఇవ్వకుండా లీక్ చేసి మొత్తం చెడగొడుతున్నారంటూ హిట్ 3 డైరెక్టర్ శైలేష్ కొలను ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనికి సంబందించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read:  Secunderabad railway station: ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ నుంచి రైళ్లు మళ్లింపు.. తెలుసుకోకుంటే చిక్కే!

ఆడియెన్స్ సినిమాల్లో చూడాలనుకునే ప్రత్యేక సన్నీవేశాల కోసం.. మేము రాత్రి, పగలు అని తేడా లేకుండా చాలా కష్టపడుతుంటాం.. మీ ముందుకు మంచి సినిమా తీసుకురావడం కోసం మా శక్తికి మించి కష్టపడి పనిచేస్తుంటాం. మేము క్రియోట్ చేసే ఆ ఎఫెక్ట్ కోసం, రిజల్ట్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాము. దానిలోనే మాకు సంతోషం ఉంటుంది. ప్రస్తుతం, మీడియా చేసే పనులు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. కొందరు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా లీక్ చేసి ఆనందం పొందుతారు. థియేటర్లో ప్రేక్షకులు ఆ మూమెంట్‌ను ఎంజాయ్ చేయాలని మేం ప్లాన్ చేస్తే.. ఇలా ఇష్టమొచ్చినట్లు లీక్ చేసి మొత్తం చెడగొట్టేస్తున్నారు..

Also Read:  OTT Movie: బిడ్డ కోసం దెయ్యాలతో యుద్ధం చేసిన ఓ తల్లి కథ .. త్వరలో ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే?

అందరి కన్నా మీరే ముందే ఇవ్వాలనే మీ ఆరాటం గురించి మాకు తెలుసు.. అలా అని ఎథిక్స్ మరిచిపోయి ప్రవర్తించడం కరెక్ట్ కాదు. వాటిలో ఏది లీక్ చేయాలి.. ఏది లీక్ చేయకూడదనే విషయం తెలిసి ఉండాలి. ఇలా చేయడం తప్పా? రైటా? అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.. ఒకప్పుడు జర్నలిజం వేరు.. ఇప్పుడున్నది చాలా వేరు.. కొందరు తెలిసినా కూడా అస్సలు బయటకు చిన్న విషయం కూడా రానిచ్చే వాళ్ళు కాదు.. అది ఎథిక్స్ అంటే.. ఇలాంటి పనులు మీరు చేస్తే.. మా నుంచి మీరు దొంగతనం చేసినట్టు కాదు.. ప్రేక్షుకుల సంతోషాన్ని దొంగిలించినట్టే” అంటూ ఆయన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Just In

01

Local Body Elections: తెలంగాణ పల్లెల్లో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..!

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?