Alekhya Chitti in ICU: గత కొద్దీ రోజుల నుంచి ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చూసిన అలేఖ్య చిట్టి పికిల్స్ పేరే వినబడుతోంది. మీ పచ్చడి రేట్లు ఏంటి మరి ఇంత ఎక్కువగా ఉన్నాయని అడిగినందుకు.. కస్టమర్లు అని చూడకుండా.. పికిల్స్ యజమాని అలేఖ్య బూతులతో పిచ్చిగా పిచ్చిగా రెచ్చిపోయింది. పచ్చళ్లు గురించి కాకుండా .. వాట్సాప్ లో అసభ్యపదాలు మాట్లాడుతూ మెసేజ్ లు పంపింది. ఇవి కాస్తా వైరల్ కావడంతో నెట్టింట ఇది హాట్ టాపిక్ గా మారింది.
అలేఖ్య చిట్టి పికిల్స్ ( Alekhya Chitti Pickles ) వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ప్రస్తుతం, ఎక్కడ చూసినా ఈమె చేసిన బాగోతమే కనిపిస్తుంది. ఆ ముగ్గురు అక్కా- చెల్లెళ్లకు.. నెటిజెన్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారు. సారీ చెప్పినా కూడా వదల్లేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ ను ఘోరంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
Also Read: chilukur balaji temple: రేపటి నుండి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు.. ఈసారి ఆ ప్రసాదం లేనట్లే!
అయితే, తాజాగా అలేఖ్యకి సంబందించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అలేఖ్య ( Alekhya) ఐసీయూలో ( ICU ) లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను అలేఖ్య సిస్టర్ సుమ సోషల్ మీడియాలో వేదికగా పోస్ట్ చేసింది.
సోషల్ మీడియాలో ఆమె మీద చేసే ట్రోలింగ్ కి మనస్తానికి గురై ఆరోగ్యం క్షీణించిందని.. అందు వలనే హాస్పిటల్లో జాయిన్ అయినట్లు ఆమె తెలిపింది.
ఆక్సిజన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో తన సోదరి అలేఖ్య ( Alekhya) లేదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. దయచేసి ఇప్పటికైనా మా ఫ్యామిలీ పైన ట్రోలింగ్ ఆపండి అంటూ రిక్వెస్ట్ చేసింది. మూడు నెలల క్రితం తమ తండ్రి మరణించాడని.. ఇప్పుడు మళ్లీ మా ఇంట్లో మరో చావు చూడకూడదని కోరుకుంటున్నట్లు తెలిపింది. పచ్చళ్ళ బిజినెస్ , యూట్యూబ్ ఇలా మాకు ఇంక ఏం వద్దంటూ ఆమె తెలిపింది. అయితే, ఆమె ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.