SBI PO prelims result 2025: ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. 2025 మార్చిలో నిర్వహించిన ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ప్రిలిమినరీ ఫలితాలను తాజాగా విడుదల చేశారు.
పరీక్షలు రాసిన విద్యార్థులు తమ మార్కులను https://sbi.co.in/web/careers/crpd/po-pre-2024-results వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు పొందేందుకు అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్/రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించాలి.
ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ పరీక్షలు.. 2025 మార్చి 8, 16, 24, 26 తేదీల్లో జరిగాయి. తాజాగా విడుదలైన ప్రిలిమ్స్ రిజల్ట్స్ లో మెరుగైన ఫలితాలు సాధించిన అభ్యర్థులు.. మెయిన్స్ కు అర్హత సాధిస్తారు. క్వాలిఫై అయిన విద్యార్థులకు త్వరలోనే మెయిన్స్ పరీక్షలకు సంబంధించి కాల్ లెటర్ రానుంది. లెటర్ అందుకున్న అభ్యర్థులు మెయిన్స్ కు ప్రిపేర్ కావాల్సి ఉంది.