Tsunami (Image Source: Twitter)
Viral

Tsunami: విరుచుకుపడ్డ సునామీ.. 100 అడుగుల ఎత్తులో రాకాసి అలలు.. తెలిసేలోపే విధ్వంసం!

Tsunami: అలాస్కా (Alaska) లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. జూనో (Juneau) నగరానికి దక్షిణంగా ఉన్న ట్రేసీ ఆర్మ్ (Tracy Arm) ప్రాంతంలో భారీ భూకంపం, సునామీ సంభవించాయి. అలాస్కా సైస్మాలజిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం భూకంపానికి ముందు అక్కడి ప్రాంతంలో గంటల వ్యవధిలో వంద నుంచి వేల వరకూ చిన్నపాటి భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే దీనిని కొద్ది గంటలపాటు ఎవరూ గుర్తించలేదు.

కయాకర్లు గుర్తించి..
హార్బర్ ఐలాండ్‌లో (హోల్కమ్ బే  (Holkham Bay)లో ఉన్న ఒక నిర్జన ద్వీపం) ఓ శిబిరం వద్ద ఉన్న ముగ్గురు కయాకర్లు (చిన్నబోటుతో నీటిపై స్టంట్స్ చేసేవారు) అలలు ఉదృతంగా రావడాన్ని గమనించారు. తమ శిబిరానికి కొద్ది దూరంలో అలలు కొద్ది అంగుళాల మేర ఎగసిపడుతున్న శబ్దం రావడంతో వారు మేల్కొన్నారు. సునామీ అలల తాకిడికి గురైన హార్బర్ ఐలాండ్.. ట్రేసీ ఆర్మ్ (Tracy Arm), ఎండికాట్ ఆర్మ్ (Endicott Arm) అనే దక్షిణ-ఆగ్నేయ అలాస్కాలోని ప్రసిద్ధమైన రెండు ఫ్జోర్డ్లు కలిసే ప్రదేశం దగ్గర ఉంది. కయాకర్.. తీరం వెంబడి టెంటు ఏర్పాటు చేసుకొని ఉండగా.. తెల్లారి లేచేసరికి వారి సామాగ్రి కొట్టుకుపోయింది. కయాకర్ల బోట్లు ఒకటి పర్వత పైభాగంలో.. మరొకటి చెట్టుపై, ఇంకొకటి పావు మైలు దూరంలో తేలుతూ కనిపించాయి.

పర్వతం అంచు కూలడంతోనే..
హార్బర్ ఐలాండ్‌లోని కయాకర్లు ఇచ్చిన సమాచారంతోనే అక్కడ భూకంపం వచ్చినట్లు, అది రాకాసి అలలకు కారణమైనట్లు సైస్మాలజిస్టులు కనుగొన్నారు. సైస్మాలజిస్ట్ మైఖేల్ వెస్ట్‌ (Seismologist Michael West)కి వారు సమాచారం అందించారు. వెస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర అమెరికా అంతటా ఉన్న సైస్మోమీటర్లు ఈ సంఘటనను గుర్తించాయి. ఒక పర్వతం అంచు నీటిలో కూలిపోవడంతో సునామీ అలలు పుట్టాయని.. నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. పర్వతం నుంచి పలు దశల్లో అతి భారీ రాళ్లు, మట్టి నీటిలో పడి ఉండొచ్చని పేర్కొన్నారు.

‘ఫుట్ బాల్ మైదానం పరిమాణంలోని రాయి’
ఈ ఘటన ట్రేసీ ఆర్మ్ చివరన.. సౌత్ సాయర్ హిమానీనదం సముద్రపు నీటిని తాకే ప్రదేశంలో చోటుచేసుకున్నట్లు సిస్మాలజిస్ట్ మైఖేల్ వెస్ట్ తెలిపారు. దాని వల్లే అతి భారీ సునామీ పుట్టింది. ‘ఫుట్‌బాల్ మైదానం పరిమాణం లేదా అంతకంటే పెద్దదైన రెండు రాళ్లు సముద్రపు నీటిలో విరిగిపడ్డాయి’ అని వెస్ట్ చెప్పారు. కయాకర్ నిక్ హైల్గెస్ట్ తీసిన ఫోటోలో.. ఫ్జోర్డ్‌లోని ఒక దీవి మొత్తం నీటిలో మునిగిపోయింది. కేవలం ఒక చెట్టు మాత్రమే పైకి కనిపించింది. ఈ చిత్రాలను బట్టి చూస్తే రాళ్లు కుప్పకూలిన ప్రాంతంలో సునామీ అలలు సునామీ అలలు కనీసం 100 అడుగుల ఎత్తులో వచ్చి ఉండొచ్చని సెస్మాలజిస్టులు అంచనా వేస్తున్నారు.

Also Read: Khammam Police commissioner: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాగులు వంకలు దాటొద్దు.. పోలీస్ కమిషనర్ సూచనలు

అందువల్లే విపత్తు గుర్తించలేదు
ఘటన జరిగిన ప్రాంతం.. భూకంప స్వయంచాలక గుర్తింపు వ్యవస్థ పరిధిలో లేదని సెస్మాలిజిస్ట్ వెస్ట్ తెలిపారు. అందువల్లే భూకంపాల కేంద్రం (Earthquake Centres) వీటిని ఆటోమేటిక్‌గా గుర్తించలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ భూ ప్రకంపనల సంకేతం దగ్గరలోని సైస్మిక్ స్టేషన్లే కాకుండా 1,000 కి.మీ. దూరంలోని స్టేషన్లలో కూడా నమోదయ్యాయని పేర్కొన్నారు. ఇది నిజంగా ‘అత్యంత అరుదైన భూభౌతిక సంఘటన’ అని వెస్ట్ చెప్పుకొచ్చారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూ శాస్త్రవేత్తలు సంవత్సరాల పాటు అధ్యయనం చేస్తారని వెస్ట్ అభిప్రాయపడ్డారు.

Also Read This: Coolie Review In Telugu: కూలీ మూవీ జెన్యూన్ రివ్యూ.. థియేటర్ లో మాస్ ఫ్యాన్స్ విజిల్స్ మోత మోగిపోతుందిగా!

Just In

01

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..