Coolie (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Coolie Review In Telugu: కూలీ మూవీ జెన్యూన్ రివ్యూ.. థియేటర్ లో మాస్ ఫ్యాన్స్ విజిల్స్ మోత మోగిపోతుందిగా!

Coolie Review In Telugu: రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రం వరల్డ్ వైడ్ గా ఆగస్టు 14, 2025న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకం పై కళానిధి మారన్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగార్జున (విలన్ పాత్రలో), అమీర్ ఖాన్ (స్పెషల్ క్యామియో), ఉపేంద్ర, శృతి హాసన్, పూజా హెగ్డే (స్పెషల్ సాంగ్), సౌబిన్ షాహిర్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలగా నిలిచాయి.

కథ సారాంశం‘కూలీ’ ఒక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్. దేవా (రజనీకాంత్), రాజశేఖర్ (సత్యరాజ్) స్నేహితులు. రాజశేఖర్ తయారు చేసిన ఒక ప్రత్యేక కుర్చీ చుట్టూ కథ సాగుతుంది. ఈ కుర్చీని సైమన్ (నాగార్జున) సహా ఇతరులు కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో రాజశేఖర్ కూతురు ప్రీతి (శృతి హాసన్) ఆపదలో చిక్కుకుంటుంది. స్నేహితుడి కూతురిని కాపాడేందుకు దేవా రంగంలోకి దిగుతాడు. ఈ కథలో దేవా, సైమన్ మధ్య యుద్ధం, ట్విస్టులతో సినిమా సాగుతుంది. సినిమా రిలీజ్ కు ముందే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్లింది. సినిమాలో రజనీకాంత్ పవర్ఫుల్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు.

Also Read: Uttam Kumar Reddy: 72 గంటలు ఆయా కేంద్రాల్లోనే ఉండాలి.. అధికారులకు మంత్రి ఆదేశం

పాజిటివ్ పాయింట్స్

రజనీకాంత్ పెర్ఫార్మెన్స్: రజనీకాంత్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడనే చెప్పుకోవాలి. ఇంట్రో సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, క్లైమాక్స్‌లో అతని పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించాయి.

నాగార్జున విలన్ రోల్: నాగార్జున తొలిసారి విలన్‌గా నటించి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. అతని ఇంట్రడక్షన్ సీన్ మరియు రజనీతో క్యాట్ అండ్ మౌస్ గేమ్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

అనిరుధ్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. సాంగ్స్ సినిమాకు ఊపును తెచ్చాయి. ముఖ్యంగా, పూజా హెగ్డే ‘మోనికా’ సాంగ్ విజువల్‌గా ఆకట్టుకుంది.

క్లైమాక్స్ ట్విస్ట్: చివరి 20 నిమిషాలు క్లైమాక్స్‌లో ఊహించని సర్‌ప్రైజ్ ఎలిమెంట్ థ్రిల్ చేసింది.

సాంకేతిక అంశాలు: గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఐమాక్స్ వెర్షన్, యాక్షన్ సీక్వెన్స్‌లు విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలివేట్ చేశాయి.

Also Read: BRAOU UG PG Admissions 2025: బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ పీజీ అడ్మిషన్లకు చివరి తేదీ పొడిగింపు

నెగిటివ్ పాయింట్స్

కథ, స్క్రీన్‌ప్లే: స్క్రీన్‌ప్లే పై కాస్త దృష్టి పెట్టి బావుండేది. ముఖ్యంగా, సెకండ్ హాఫ్‌లో స్లో పేసింగ్, లాజిక్ లేని సన్నివేశాలు నిరాశపరిచాయి.

సెకండ్ హాఫ్ లాగ్: ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్నప్పటికీ, సెకండ్ హాఫ్ లాగ్ అయింది.

అమీర్ ఖాన్ క్యామియో: అమీర్ ఖాన్ క్యామియో ఆకట్టుకున్నప్పటికీ.. ఇంకాస్త బాగా డిజైన్ చేసి అద్భుతంగా ఉండేది.

సినిమా గురించి ఒక్క మాటలో చెప్పలంటే.. రజినీ కాంత్ నటన అదుర్స్.. మాస్ యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

రేటింగ్: 2.5/ 5

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది