AI Birthday Video
Viral, లేటెస్ట్ న్యూస్

Viral Video: ఏఐ మ్యాజిక్.. ఈ వీడియో నిజం కాదంటే నమ్మలేరు!

Viral Video: ఏఐ టెక్నాలజీతో రూపొందిస్తున్న వీడియోలు (Viral Video), ఫొటోలు చూస్తే.. ఒక్క క్షణం పాటు నిజమా? నకిలీవా? అనే అనుమానం చాలా సార్లు కలుగుతోంది!. ఇంతకుముందు ఏఐతో సృష్టించిన ఫొటోలు లేదా వీడియోల్లో ఫేక్‌ అనిపించే లక్షణాలు కనిపించేవి. ముఖాల్లో కాస్త వ్యత్యాసాలు, కాళ్లు, చేతులు వంకర, అర్థంపర్థంలేని బ్యాగ్రౌండ్‌లు ఇలా తేడా స్పష్టంగా కనిపించేవి. అయితే, ఇప్పుడు కొత్తగా మరింత మెరుగుపడిన ఏఐ వీడియోలు, ఫొటోలు నమ్మబుద్ధికాని విధంగా నిజమైనవాటి మాదిరిగానే కనిపిస్తున్నాయి. అలాంటి వీడియోలో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక మహిళ డైనింగ్ టేబుల్ మీద ఒక కేక్ పెట్టింది. ఆ టేబుల్ మీద నీళ్ల బాటిళ్లు, ప్లేట్లు, చెంచాలు, ఫోర్కులు ఇలా ఉన్నాయి. టేబుల్ చుట్టూ ఉన్న పిల్లలు ఆనందంతో చప్పట్లు కొడుతుండుగా, ఒకామె వచ్చి కేక్ టేబుల్ మీద పెట్టగా, పక్కనే ఉన్న వ్యక్తి కేక్ మీద కొవ్వొత్తులను ఊదాడు. పిల్లలంతా మరింత సంతోషంగా చప్పట్లు కొట్టారు. ఈ వీడియో ఒక సాదాసీదా భారతీయ మధ్య తరగతి కుటుంబంలో జరిగిన పుట్టిన రోజు వేడుకలా అనిపించింది. కానీ, ఇది అసలు నిజమైన వీడియో కాదు. ఇది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో సృష్టించిన వీడియో.

Read Also- Gold Rates Down: ఎగిరిగంతేసే గుడ్ న్యూస్.. త్వరలో రూ.30,000 వేల వరకు తగ్గనున్న గోల్డ్ రేట్స్..?

ఈ వీడియోను వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘ఆండ్రీసెన్ హోరోవిట్జ్’కి చెందిన జస్టిన్ మూర్ అనే వ్యక్తి ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు. గత రెండు వ్యవధిలో ‘జనరేటివ్ ఏఐ’ ఏ స్థాయిలో మెరుగుపడిందో ఈ వీడియో ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పటివరకు కనిపించిన ఏఐ వీడియోలతో పోల్చితే ఇది చాలాచాలా రియలిస్టిక్‌గా అనిపిస్తోంది. కెమెరాతో తీసినట్టుగా సినిమా లుక్‌లో కనిపించింది. ఏఐని ఉపయోగించి పాత కాలపు కెమెరాతో తీసినట్టుగా వీడియో కనిపించింది. ఈ వీడియోపై జస్టిన్ మూర్ స్పందిస్తూ, “ఇది నిజమైన హోమ్ వీడియో కాదు. ఇప్పటివరకు ఏఐ వీడియోలు కేవలం క్లారిటీగా, సినిమా స్టైల్‌‍లో ఉంటున్నాయి. అయితే, ఇప్పుడు పాత కెమెరా లేదా పాత ఫోన్‌తో తీసినట్లుగా కనిపించే వీడియోలు కూడా ఏఐతో సృష్టించవచ్చు. త్వరలో మనం ఈ విధమైన అనేక రకాల ఏఐ వీడియోలను చూడబోతున్నాం” అని పేర్కొన్నారు.

Read Also- BC Reservation Bill: గవర్నర్ బీసీ రిజర్వేషన్లపై గెజిట్ జారీ చేయాలి.. కవిత డిమాండ్

ఈ వీడియోను ‘ఫ్లక్స్ ప్రో’ (Flux Pro) అనే టూల్‌ను సీడాన్స్ (Seedance) అనే టూల్‌తో కలిపి సృష్టించినట్టు మూర్ వివరించారు. ‘సాధారణమైన హోమ్ వీడియో’లా కనిపించే విధంగా ప్రాంప్ట్ ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ వీడియో చూసిన చాలామంది నిజమైనదేనని భావించగా, కొందరు మాత్రం బాగా పరిశీలించి కొన్ని తప్పులను వెతికి పట్టుకున్నారు. ఇది ఏఐ వీడియో అనడానికి ఇవే ప్రూఫ్స్ అంటున్నారు.

వ్యత్యాసాలు ఇవే..
వీడియోలో కేక్ తీసుకొచ్చిన మహిళ రెండు చెవులకు రెండు రకాల రింగులు ఉన్నాయి. ఒకటి పెద్దగా, రెండోది చిన్నగా కనిపించాయి. ఇక, కేక్ మీద క్యాండిల్స్‌ను ఊదిన తర్వాత కూడా అవి మళ్లీ వెలుగుతూ కనిపించాయి. ఎడమవైపున మూలలో ఉన్న బాలుడు ఒక్క చేతితోనే చప్పట్లు కొడుతున్నట్టుగా అసహజనంగా కనిపించింది. ఆ వ్యక్తి షర్ట్ మీద ఉన్న అక్షరాలు అర్థంపర్థంలేకుండా ఉన్నాయి. ఏఐలో ఇలాంటి పొరపాట్లు సాధారణంగా కనిపిస్తుంటాయి. మరో వ్యత్యాసం ఏమిటంటే.. క్యాండిల్స్ ఊదిన వ్యక్తి కేక్ పెట్టడానికి ముందు ఒక పేపర్ బాక్స్‌ను టేబుల్‌పై పెట్టాడు. కానీ, అది ఆ వెంటనే మాయమైపోయింది. ఈ ఐదు అంశాల ఆధారంగా ఇది నిజమైన వీడియో కాదని, ఏఐతో సృష్టించిన వీడియో అని స్పష్టమవుతోంది.

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు