Watch Video: నీటిలో ఉండే మెుసలి ఎంతటి ప్రమాదకరమైనదో అందరికీ తెలిసిందే. అది నీటిలో ఉండగా దాని బలం ముందు భారీ ఏనుగు సైతం వెనకడుగు వేయాల్సిందే. అందుకే మెుసళ్ల సంచారం ఉన్న నది, చెరువుల్లోకి దిగేందుకు చాలా మంది భయపడుతుంటారు. ఒకవేళ మెుసలి ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా సాహసించరు. ఇదిలా ఉంటే ఓ మహిళ మెుసలి తిరుగుతున్న నదిలో స్నానానికి దిగి.. దురదృష్టవశాత్తు కనిపించకుండా పోయింది.
వివరాల్లోకి వెళ్తే..
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఒక మహిళ నదిలో స్నానం చేస్తుండగా మొసలి లాక్కెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 57 ఏళ్ల వయస్సు గల మహిళ.. ఖరసోత్రా నదిలో మునిగి అదృశ్యమైంది. ఈ ఘటన బింఝర్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాంటియా గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగింది. అదృశ్యమైన మహిళను సౌదామినిగా గుర్తించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక మెుసలి మహిళను పట్టుకొని నదిలోకి లాక్కెళ్లడం కనిపించింది.
నదిలో గాలింపు చర్యలు
బింఝర్‌పూర్ పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో సౌదామిని.. ఖరసోత్రా నదిలో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా ఒక మొసలి ఆమెను లాగి లోతైన ప్రవాహంలోకి తీసుకెళ్లింది. నది ఒడ్డున ఉన్న గ్రామస్థులు మొసలిని తరిమేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమెను రక్షించలేకపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సర్వీస్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకొని నదిలో గాలింపు చర్యలు ప్రారంభించారు.
Also Read: LIC Jeevan Umang Scheme: రూ.1300 పెట్టుబడితో.. లైఫ్ లాంగ్ రూ.40,000 పెన్షన్.. ఎల్ఐసీలో సూపర్ డూపర్ స్కీమ్!
ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే?
గ్రామస్థుడు నబా కిషోర్ మాట్లాడుతూ ‘మొసలి మహిళను లాక్కెళ్తుండటాన్ని చూసి మేము నీళ్లలోకి దూకి ఆమెను రక్షించడానికి ప్రయత్నించాం. కానీ మా ప్రయత్నాలు ఫలించలేదు. మెుసలి వేగంగా ఆమెను నీటి లోపలికి తీసుకెళ్లిపోయింది. ఈ నదిలో మెుసళ్ల సంచారం ఉందని వినడమే తప్ప.. ఇప్పటివరకూ దానిని చూడలేదు. అయితే మహిళను కాపాడలేకపోయినందుకు బాధగా ఉంది’ అని కిషోర్ వాపోయారు.
ଖରସ୍ରୋତା ନଦୀରେ ମହିଳାଙ୍କୁ ଟାଣିନେଲା କୁମ୍ଭୀର । ଯାଜପୁର ବିଞ୍ଝାରପୁର କନ୍ତିଆ ଗାଁରେ ଗାଧୋଇବା ବେଳେ ମହିଳାଙ୍କୁ ଟାଣିନେଲା । ନିଖୋଜ ମହିଳାଙ୍କୁ ଖୋଜାଖୋଜି କରୁଛି ବନବିଭାଗ ।#Crocodile #Terror #River #Woman #Missing #OTV pic.twitter.com/Wcm8omCvlk
— ଓଟିଭି (@otvkhabar) October 6, 2025
