Badangpet Municipality: బడంగ్పేట్ లో పోస్టర్ల కలకలం
“అవినీతి మరక ఉన్న ఆఫీసర్ మాకొద్దు”.
బడంగ్‌పేట్ డీసీ త్రిల్లేశ్వర రావుకు వ్యతిరేకంగా పోస్టర్లు.
బాలాపూర్,స్వేచ్చ: బడంగ్‌పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్(Deputy Commissioner) త్రిల్లేశ్వర రావు(Thrilleshwara Rao)కు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. రాత్రికి రాత్రే మున్సిపల్ ఆఫీస్ పరిసరాల్లో, ప్రధాన గోడలపై ఆయనకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. “లంచగొండులను తరిమికొడదాం.. బడంగ్‌పేట్ కాపాడుకుందాం.” “గో బ్యాక్ త్రిల్లేశ్వర రావు.. లంచగొండులకు ఇక్కడ స్థానం లేదు. “”అవినీతి మరక ఉన్న ఆఫీసర్ మాకొద్దు.” “బడంగ్‌పేట్ సర్కిల్ ను అవినీతికి అడ్డగా మార్చకండి.” అన్న ట్యాగ్ లైన్లతో ఏర్పాటుచేసిన వాల్ పోస్టర్లు సర్కిల్ కార్యాలయం కు ఎదురుగా ఉన్న ప్రజా భవన్ గోడలపై అతికించడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Allu Arjun: ప్లాప్ వచ్చిన తర్వాత బన్నీ చేసేది ఇదే.. అందుకే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు..
గతంలో కాంట్రాక్టర్ వద్ద లంచం
గతంలో బడంగ్‌పేట్ మున్సిపల్(Badangpet Municipality) కమిషనర్ గా విధులు నిర్వహిస్తూఒక కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన అధికారిని తిరిగి అదే బడంగ్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా నియమించడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తూ అవినీతి మరక అంటించుకున్న అధికారిని తిరిగి ఇక్కడే అధికారిగా నియమించడం అంటే అవినీతిని ప్రోత్సహించడమే అవుతుందనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనా కార్యాలయ సమీపంలో వెలసిన ఈ వాల్ పోస్టర్లు మాత్రం సర్వత్ర చర్చాంశనీయమయ్యాయి.
Also Read: TG Education Policy: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుపై.. కేకే అధ్యయన కమిటీ ఏర్పాటు!

