TTD WhatsApp Feedback: తిరుమల భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు టిటిడి ఓ కొత్త ఫీడ్ బ్యాక్ విధానాన్ని అందుభాటులోకి తీసుకువచ్చింది. భక్తుల అభిప్రాయాల కోసం వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ విధానంను తీసుకొచ్చింది.
ఫీడ్ బ్యాక్ విధానం:
తిరుమల తిరుపతి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్‌లను మొబైల్‌తో స్కాన్ చేస్తే వాట్సాప్‌లో టిటిడి అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. దీంతో ఇక్కడ భక్తులు తమ పేరు విభాగం,అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, తదితర విషయాలు ఎంచుకోవచ్చు . మరియు భక్తుల అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ను ఎంచుకోవచ్చు. దీంతో భక్తులు తమ విషయాలను నేరుగా టిటిడీ వారికి సమాచారం పంపవచ్చు.
భక్తుల అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్, వీడియో ఫార్మాట్ ను ఎంచుకోవచ్చు. సేవా ప్రమాణాన్ని మెరుగుదల అవసరం వుందా లేదా బాగాలేదు గా రేట్ చేయాల్సి ఉంటుంది. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్‌లోడ్ చేయవచ్చు. తమ అభిప్రాయం సమర్పించిన వెంటనే, మీ అభిప్రాయం విజయవంతంగా నమోదు చేయబడింది. మీ విలువైన ఫీడ్‌బ్యాక్‌కు ధన్యవాదాలు అనే ధృవీకరణ సందేశం వస్తుందని తెలియచేశారు.
Also Read: MLA Raja Singh: చెప్పులు విడిచే చోటు పాక్ జెండా స్టిక్కర్.. ఎమ్మెల్యే వినూత్న నిరసన!