BR Naidu: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పీడ్ పెంచారు. టీటీడీని పూర్తి ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకున్న చైర్మన్ ప్రస్తుతం ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. అది కూడా భక్తుల పట్ల టీటీడీ అధికారులు, సిబ్బంది తీరు ఎలా ఉంది? భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆరా తీస్తున్నారు. మొత్తం మీద ఛైర్మన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు భాద్యతలు తీసుకున్న సమయం నుండి తిరుమలలో ప్రక్షాళన మొదలు పెట్టారని చెప్పవచ్చు. సీఎం చంద్రబాబు కూడా తన ప్రక్షాళన తిరుమల నుండే అంటూ ప్రకటించినట్లుగానే, ఛైర్మన్ బీఆర్ నాయుడు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా, తీసుకోవాల్సిన చర్యలపై ఛైర్మన్ దృష్టి సారించి సక్సెస్ సాధించారని చెప్పవచ్చు.
అంతేకాదు తిరుమలలో అన్యమతస్థులను గుర్తించడం, అలాగే స్థానిక భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం, వృద్ధులకు ఆఫ్ లైన్ టికెట్స్, శ్రీవారి అన్నప్రసాదంలో వడ పప్పు చేర్చడం, ఇలా చెప్పుకుంటూ పోతే చైర్మన్ చర్యలు ఎన్నో ఉన్నాయి. తిరుపతిలో జరిగిన ఒక్క తొక్కిసలాట మినహా మిగిలిన ప్రతి కార్యక్రమం పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేందుకు చైర్మన్, ఈవో శ్యామలరావులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
అలాగే శ్రీవారి భక్తులతో టీటీడీ ఉద్యోగులు గౌరవంగా మెలగాలని, ఎవరైనా టీటీడీ ఉద్యోగి అమర్యాదగా ప్రవర్తిస్తే గుర్తించేందుకు నేమ్ బోర్డులను కూడా ఉద్యోగులకు కేటాయించారు. ఇక తిరుమలలో దళారుల వలలో భక్తులు మోసపోకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అయితే టీటీడీ పని తీరును భక్తుల నుండి తెలుసుకొనేందుకు ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. నిన్న భక్తులతో మాట్లాడి సదుపాయాలపై ఆరా తీసిన చైర్మన్ బీఆర్ నాయుడు మారియో షాకిచ్చారు.
కల్యాణకట్టలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
శ్రీవారి భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట వద్దకు చైర్మన్ బీఆర్ నాయుడు తనిఖీకై చేరుకున్నారు. ఎవరూ ఊహించని రీతిలో ఛైర్మన్ రాగా, అక్కడి సిబ్బంది అందరూ హడలెత్తారు. భక్తులకు కట్ట వద్ద ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని క్షేత్రస్థాయిలో చైర్మన్ పరిశీలించారు. సభ్యులు శాంతారాం, నరేష్ లతో కలిసి ప్రధాన కళ్యాణకట్ట, నందకం మినీ కళ్యాణకట్టలను చైర్మన్ తనిఖీ చేశారు.
Also Read: AP Tourist Places: ఛలో ఏపీ.. వీటిని చూసేద్దాం..
ఈ సంధర్భంగా క్షురకుల ప్రవర్తన గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. రద్దీ ఎక్కువైనప్పుడు.. ఖాళీగా ఉన్న కళ్యాణకట్టలకు భక్తులను పంపాల్సిందిగా ఆయన సూచించారు. కల్యాణకట్టలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఫిర్యాదులకు అస్కారం లేకుండా, సేవాభావంతో విధులు నిర్వర్తించాలని సిబ్బందిని చైర్మన్ అదేశించారు. మొత్తం మీద ఛైర్మన్ బీఆర్ నాయుడు గత రెండు రోజులుగా ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారని చెప్పవచ్చు.